News April 8, 2024

తూ.గో: ‘వారంతా 15 రోజుల ముందే ఓటేయొచ్చు’

image

ఇంటి దగ్గర నుంచి ఓటు వేయాలని అనుకునేవారికి అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. నిబంధనల ప్రకారం నిర్దేశించిన వారంతా 15 రోజుల ముందు నుంచే ఇంటి వద్ద నుంచి ఓటు వేయొచ్చన్నారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా అమలాపురంలో 15,18,108 మంది, రాజమహేంద్రవరంలో 16,08,504 మంది, కాకినాడలో 16,11,031 మంది ఓటర్లున్నారు. వీరిలో కనీసం లక్ష మందైనా ఇంటి నుంచి ఓటింగ్‌ విధానంలో పాల్గొంటారని అధికారులు అంటున్నారు.

Similar News

News December 21, 2025

రాజమండ్రి: జిల్లాలో 98 శాతం పల్స్ పోలియో నమోదు

image

జిల్లాలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతమైందని DMHO డాక్టర్ కె. వెంకటేశ్వర రావు తెలిపారు. మొత్తం 1,89,550 మంది చిన్నారులకు గానూ 1,85,759 మందికి చుక్కలు వేయడం ద్వారా 98 శాతం లక్ష్యాన్ని చేరుకున్నామని వివరించారు. మిగిలిన వారికి సోమ, మంగళవారాల్లో వైద్య సిబ్బంది నేరుగా ఇళ్లకు వెళ్లి పోలియో చుక్కలు వేస్తారని పేర్కొన్నారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

News December 21, 2025

రాజమండ్రిలో కేజీ చికెన్ ధర ఎంతంటే?

image

వీకెండ్ వచ్చిందంటే మాంస ప్రియులకు పండుగే. రాజమహేంద్రవరం మార్కెట్లో కేజీ స్కిన్ లెస్ ధర రూ.260, స్కిన్ తో కేజీ చికెన్ ధర రూ.240కు అమ్మకాలు జరుగుతున్నాయి. లైవ్ కోడి రూ.135-150కి లభ్యమవుతోంది. ఇదిలా ఉండగా కేజీ మటన్ ధర రూ.900 నుంచి వెయ్యి రూపాయల వరకు మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఆయా ఏరియాల బట్టి మార్కెట్లో చికెన్, మటన్ రేట్లు స్వల్ప తేడాలు ఉన్నాయి. మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News December 21, 2025

లోకేశ్ పర్యటన అంతా ఆర్భాటమే: మార్గాని

image

మంత్రి లోకేశ్ రాజమండ్రి పర్యటన కేవలం ఆర్భాటం తప్ప మరేమీ లేదని మాజీ ఎంపీ మార్గాని భరత్ శనివారం విమర్శించారు. పర్యటన సాగిన ప్రతిచోటా వైసీపీ మార్క్ అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఆసుపత్రిలో బాలింత మృతి, బాలికపై అత్యాచారం వంటి దారుణ ఘటనలపై మంత్రి స్పందించకపోవడంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శాంతిభద్రతల వైఫల్యాన్ని వదిలి లోకేశ్ ప్రచారానికే ప్రాధాన్యమిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.