News April 8, 2025
తూ.గో: వీడు మామూలోడు కాదు..!

బిక్కవోలు జగనన్న కాలనీలో నిన్న ఓ యువకుడు గంజాయితో పట్టుబడిన విషయం తెలిసిందే. నర్సీపట్నానికి చెందిన సూర్యప్రకాశ్ 10వ తరగతి వరకు చదివాడు. కాకినాడ జిల్లా ఉప్పాడలోని ఓ చికెన్ సెంటర్‌లో పనిచేస్తూ బైక్‌లు దొంగలిస్తున్నాడు. మరోవైపు గంజాయి వ్యాపారానికి తెరలేపాడు. దొంగతనం చేసిన బైకును కె.పెదబయలుకు చెందిన పంతులబాబు అనే వ్యక్తికి ఇచ్చి గంజాయి తీసుకుని బిక్కవోలుకు రాగా పోలీసులకు దొరికాడు.
Similar News
News April 16, 2025
వైజాగ్‌లో ముక్కామలకు చెందిన యువకుడి మృతి

వైజాగ్‌లోని దివీస్‌లో పనిచేస్తున్న పెరవలి మండలం ముక్కామలకు చెందిన మధు మోహన్ మంగళవారం మృతి చెందాడు. మోహన్ దివీస్‌లో పనిచేస్తూ హాస్టల్లో ఉంటున్నాడు. సోమవారం రాత్రి విధులు ముగించుకొని హాస్టల్‌కి వచ్చాడు. అనంతరం ఫోన్ మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. భీమిలి పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు.
News April 16, 2025
రాజమండ్రి: నేటి నుంచి మోగనున్న పెళ్లి బాజాలు

నేటి నుంచి జిల్లాలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఈ వేసవిలో వేల సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి. బుధవారం నుంచి జూన్ 8 వరకు పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. మళ్లీ జూన్ 11 నుంచి జూలై 12వరకు ముహూర్తాలు లేవు. జూలై 25 నుంచి శ్రావణమాసంలో శుభ ఘడియలు ఉండటంతో ముహూర్తాలు ఉండనున్నాయి. ఇక ఏప్రిల్, మే, జూన్ నెలల్లో శుభ ముహూర్తాలు ఎక్కువగా ఉండటంతో తెలుగింట వివాహ వేడుకలకు అంతా సిద్ధం అవుతున్నారు.
News April 16, 2025
తెలంగాణలో చనిపోయిన ముగ్గురు జిల్లా వాసులు వీరే..

తెలంగాణలో జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం రాఘవాపూర్ శివారు జాతీయ రహదారి వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో AMP (M) సవరప్పాలేనికి చెందిన ఒకే కుటుంబసభ్యులు ముగ్గురు మృతి చెందారు. సత్తి శ్రీను, భార్య రమణకుమారి, కుమార్తె అనూష చనిపోయారు. వీరి మృతదేహాలకు జనగామ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేసి బుధవారం సొంత గ్రామానికి తీసుకురానున్నట్లు బంధువులు తెలిపారు. వారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.