News December 10, 2025

తూ.గో: సినిమాల్లో నటిస్తున్న మంత్రి

image

మంత్రి వాసంశెట్టి సుభాష్‌ ఒకవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే.. మరోవైపు తెరంగేట్రం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మూఢ నమ్మకాలు, ఆడపిల్లలపై జరిగే దారుణాలను ప్రధానాంశంగా తీసుకుని తెరకెక్కిస్తున్న ‘ఎవరది’ చిత్రంలో ఆయన జమిందార్ పాత్రలో నటిస్తున్నారు. ఏలూరు జిల్లా పెదపాడులో బుధవారం ఈ చిత్రం షూటింగ్ జరిగింది. మంత్రి సుభాష్‌తో పాటు ఇతర నటులపై పలు సన్నివేశాలను చిత్ర యూనిట్ చిత్రీకరించింది.

Similar News

News December 15, 2025

కొంత ఊరట.. అరటి కిలో రూ.17

image

అరటి ధర పుంజుకుని కిలో కనిష్ఠ ధర ₹.10, గరిష్ఠంగా ₹17కు చేరింది. రాయలసీమ అరటిని ఉత్తరాది రాష్ట్రాల వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. గత నెలలో నాణ్యత లేని అరటి కిలో ₹2కు పడిపోయింది. నెల రోజుల పాటు ఎగుమతులు మందగించాయి. ఈ ఏడాది మహారాష్ట్ర, యూపీలలో సాగు పెరగడంతో సీమ అరటికి డిమాండ్ తగ్గింది. ప్రస్తుతం పులివెందుల మార్కెట్‌లో గరిష్ఠ ధర ₹16-17 పలికింది. ధర మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

News December 15, 2025

కోటి సంతకాల పత్రాలతో నేడు వైసీపీ ర్యాలీలు

image

AP: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించనున్నట్లు వైసీపీ తెలిపింది. అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ కార్యక్రమం చేపట్టనుంది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేకరించిన కోటి సంతకాల పత్రాలను పార్టీ శ్రేణులు ర్యాలీలో ప్రదర్శించనున్నాయి. వాటిని ఈ నెల 18న గవర్నర్‌ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు వైసీపీ అధినేత జగన్ అందజేయనున్నారు. కాలేజీలను ప్రైవేటుపరం చేయొద్దని కోరనున్నారు.

News December 15, 2025

మడకశిర సౌందర్యకు ‘శ్రీమతి ఆంధ్రప్రదేశ్’ రన్నరప్

image

మడకశిరకు చెందిన సోను సౌందర్య ‘శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025’ పోటీలలో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచి మడకశిర ఖ్యాతిని రాష్ట్రస్థాయికి తీసుకెళ్లారు. విజయవాడలో జరిగిన ఈ పోటీలలో ఆమె సత్తా చాటారు. అక్టోబర్‌లో ‘శ్రీమతి విజయవాడ’ కిరీటాన్ని కూడా దక్కించుకున్న ఆమె, బ్యూటీషియన్‌గా కూడా రాణిస్తున్నారు. సౌందర్య సాధిస్తున్న విజయాలు నేటి గృహిణిలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి.