News January 23, 2025
తూ.గో: స్పా సెంటర్ పై పోలీసులు దాడి

వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు రాజమండ్రి జేఎన్ రోడ్డులో న్యూ ట్రెండ్జ్ బ్యూటీ మ్యూజిక్ స్పా సెంటర్ పై బుదవారం రాత్రి ప్రకాష్ నగర్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో ఆరుగురు మహిళలు, ముగ్గురు విటులను స్టేషనుకు తరలించారు. స్పా నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ బాజీలాల్ తెలిపారు. వ్యభిచారం నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Similar News
News February 28, 2026
తూ.గో: పొట్టకూటి కోసం వెళ్తూ.. మృత్యవాత

తూ.గో. జిల్లా దేవరపల్లి మండలం ఎర్నగూడెం జాతీయ రహదారి ఫ్లైఓవర్‌పై లారీ పైనుంచి జారిపడి వ్యక్తి మృతి చెందాడు. విజయనగరం జిల్లా గజపతినగరం(M) పాతబగ్గానికి చెందిన కొందరు సభ్యులు కృష్ణాజిల్లా గుడివాడ మినప చేలు తీత కోసం బయలుదేరి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. నిద్ర మత్తులో ఉండగా లారీ వెనక డోర్ పైనుంచి జారిపడి తలకు దెబ్బ తగిలి సంఘటన స్థలంలోనే మృతి చెందినట్లు తెలుస్తోంది.
News February 28, 2026
ఈనెల 28 నుంచి హెచ్‌పీవీ వ్యాక్సిన్ పంపిణీ: ఎంపీ

మహిళల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ (సెర్వికల్ క్యాన్సర్) నివారణకు ఈనెల 28 నుంచి హెచ్‌పీవీ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుందని ఎంపీ పురందేశ్వరి తెలిపారు. బాలికలు, యువతుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. క్యాన్సర్ ముప్పును ముందస్తుగా అరికట్టేందుకు తల్లిదండ్రులు బాధ్యతగా తమ పిల్లలకు ఈ వ్యాక్సిన్ వేయించాలని ఆమె కోరారు.