News January 9, 2026

తూ.గో: హోటళ్లు, రిసార్టులు హౌస్‌ఫుల్

image

గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. హైదరాబాద్, బెంగళూరు నుంచి తరలివస్తున్న అతిథులతో సందడి నెలకొంది. ఈ నెల 13 నుంచి 18 వరకు హోటళ్లు, రిసార్టులు ఇప్పటికే నిండిపోయాయి. కోడిపందాలు, పడవ పోటీలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉత్సవాలకు ప్రముఖులు హాజరవుతున్నారు. అతిథుల మర్యాదల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

Similar News

News February 19, 2026

హై బీపీ.. ఇలా తగ్గించుకోండి!

image

అధిక రక్తపోటు వల్ల గుండె, మెదడు, కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. హై BPని అదుపులో ఉంచుకోవాలని సూచిస్తున్నారు. ‘సోడియం ఎక్కువుండే ఫుడ్ తినొద్దు. పండ్లు, కూరగాయలు, మిల్లెట్స్‌తో కూడిన ఆహారం తీసుకోండి. వ్యాయామం చేయండి. మద్యం అలవాటు ఉంటే మితంగా తాగండి. ధ్యానం/యోగాతో ఒత్తిడి తగ్గించుకోండి. క్రమం తప్పకుండా BP చెక్ చేసుకోండి. మందులు స్కిప్ చేయొద్దు’ అని చెబుతున్నారు.

News February 19, 2026

గజ్వేల్: ‘వ్యక్తిగత పరిశుభ్రతే ఆరోగ్యానికి రక్ష’

image

‘వ్యక్తిగత పరిశుభ్రతే ఆరోగ్యానికి రక్ష’ అని గజ్వేల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అన్నపూర్ణ అన్నారు. కాయకల్ప పథకంలో భాగంగా పెద్దపల్లి జిల్లాకు చెందిన టీం లీడర్లు డాక్టర్ విజయ్, డాక్టర్ నీరజ బృందం బుధవారం గజ్వేల్ జిల్లా ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలో నిర్వహిస్తున్న పారిశుధ్య పనులు, రోగులకు అందుతున్న వైద్య సేవలను వారు పరిశీలించి, ఇక్కడి నిర్వహణ చాలా బాగుందని కితాబిచ్చారు.

News February 19, 2026

T20 WC: ఇవాళ 3 మ్యాచులు

image

T20 WCలో భాగంగా ఇవాళ 3 మ్యాచులు జరగనున్నాయి. 11AMకు వెస్టిండీస్- ఇటలీ, 3PMకు శ్రీలంక-జింబాబ్వే, 7PMకు అఫ్గాన్-కెనడా ఆడనున్నాయి. ఇప్పటికే సూపర్-8 జట్లు ఖరారు అయ్యాయి. దీంతో నేటి మ్యాచులు నామమాత్రమే. రేపు ఆస్ట్రేలియా-ఒమన్ మధ్య చివరి లీగ్ మ్యాచ్ జరగనుంది. ఈనెల 21 నుంచి సూపర్ 8 మ్యాచులు ప్రారంభం కానున్నాయి. 22న సౌతాఫ్రికాతో టీమ్ ఇండియా తలపడనుంది.