News February 7, 2025
తూ.గో: 13 మద్యం షాపులకు 17 దరఖాస్తులు
జిల్లాలో కల్లుగీత వృత్తులకు కేటాయించిన 13 మద్యం షాపుల దరఖాస్తులకు 8వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువు పొడిగించామని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి చింతాడ లావణ్య తెలిపారు. ఇప్పటివరకు 13 మద్యం షాపులకు 17 దరఖాస్తులు మాత్రమే వచ్చాయన్నారు. 9న దరఖాస్తులు పరిశీలన, 10న రాజమండ్రి ఆర్‌డీవో కార్యాలయంలో షాపులు కేటాయింపునకు సంబంధించి డ్రా తీసి అదేరోజు షాపులు కేటాయిస్తామన్నారు.
Similar News
News February 7, 2025
రాజమండ్రి: పార్కులు థీమ్స్ పార్క్‌లు అభివృద్ధి చేయాలి- కలెక్టర్
రాజమండ్రిలోని పార్కులను మూస పద్ధతిలో కాకుండా ఒక ప్రత్యేకత కలిగిన థీమ్‌లతో పర్యాటకులను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి స్పష్టం చేశారు. 2027 పుష్కరాల నాటికి ఆమేరకు పనులు పూర్తి చెయాలని తెలిపారు. శుక్రవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఆమె మాట్లాడారు. నగరంలోని 26 పార్కులను ఆయా పార్కుల అభివృద్ధి ఒక ప్రత్యేకత కలిగి ఉండేలా చూడాలని సూచించారు.
News February 7, 2025
తూ.గో: రేపు 6రైళ్లు రద్దు.. మరో 13 దారి మళ్లింపు
విజయవాడ డివిజన్‌లో సాంకేతిక పనుల కారణంగా ఈనెల 8న జిల్లా మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లను రద్దు చేసి 13 రైళ్లను దారి మళ్లింపు చర్యలు చేపట్టినట్టు రైల్వే అధికారులు గురువారం ప్రకటించారు. విజయవాడ- రాజమహేంద్రవరం, రాజమహేంద్రవరం-విజయవాడ (67262/61), విజయవాడ-రాజమహేంద్రవరం, రాజమహేంద్రవరం- విజయవాడ (67202/01), కాకినాడ పోర్ట్- విజయవాడ, విజయవాడ- కాకినాడ (17258/57) రైళ్లను రద్దు చేసినట్టు తెలిపారు.
News February 6, 2025
గోకవరం: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
కొత్తపల్లి నుంచి కామరాజుపేట వెళ్లే జంక్షన్ వద్ద గురువారం బైక్ అదుపుతప్పి రోడ్డుపై యువకుడు పడిపోయాడు. దీంతో అతడి తలకు బలంగా దెబ్బ తగిలినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే 108కు కాల్ చేసి గోకవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే యువకుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.