News April 16, 2024

తూ.గో.: 14 వరకు నిషేధం.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

image

సముద్రంలో చేపల వేట నిషేధం సోమవారం నుంచి అమల్లోకి వచ్చిందని FDO రామకృష్ణ తెలిపారు. ముమ్మిడివరం నియోజకవర్గం ఐ.పోలవరం, బలుసుతిప్ప గ్రామాల్లో 683 బోట్లు, కొత్తపాలెం పరిధిలో 309 బోట్లు ఉన్నాయన్నారు. జూన్ 14 వరకు వేట నిషేధం అమలులో ఉంటుందన్నారు. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే ఏపీ సముద్ర మత్స్య క్రమబద్ధీకరణ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Similar News

News September 29, 2024

కాకినాడ వాసి ఫిర్యాదు.. యాపిల్ సంస్థకు రూ.లక్ష ఫైన్

image

ప్రముఖ మొబైల్ సంస్థ ‘యాపిల్’కు కాకినాడ వినియోగదారుల కమిషన్ రూ.లక్ష ఫైన్ విధించింది. కాకినాడలోని సూర్యారావుపేటకు చెందిన పద్మరాజు 2021 OCT 13న రూ.85,800లకు యాపిల్ ఫోన్ కొన్నారు. ఫోన్ కొంటే ఇయర్ పాడ్స్ ఫ్రీ అని ప్రకటించిన సంస్థ.. తనకు ఫోన్ పంపి, ఇయర్ పాడ్స్ ఇవ్వలేదని పద్మరాజు పలుమార్లు కస్టమర్ కేర్‌కు ఫోన్ చేశారు. స్పందన లేకపోవడంతో ఆయన 2022లో కమిషన్‌ను ఆశ్రయించగా.. శనివారం తీర్పు వెలువడింది.

News September 29, 2024

మార్కెట్‌లో షాక్ ఇస్తున్న ‘కొత్తిమీర’ ధరలు

image

ఏ కూరైనా సరే ఘుమఘుమలాడాలంటే చివరలో కాస్తంత ‘కొత్తిమీర’ పడాల్సిందే. అయితే.. ప్రస్తుత ధర చూసి సామాన్యులు కొత్తమీర కట్ట కొనాలంటేనే జంకుతున్నారు. ఉమ్మడి తూ.గో జిల్లాలో కొన్ని చోట్ల ఒక్కో కట్ట ధర రూ.50 ఉండగా.. కిలో రూ.300పైనే ఉంది. ఇదొక్కటే కాదు ఆకుకూరల రేట్లన్నీ అదే రేంజ్‌లో ఉన్నాయి. ఇటీవలి వర్షాల దెబ్బకు ఆకుకూరల పంటలు దెబ్బతినడంతో దిగుబడి తగ్గి రేట్లు భగ్గుమంటున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.

News September 29, 2024

కోనసీమ: ప్రముఖ రచయిత్రి కన్నుమూత

image

ప్రముఖ రచయిత్రి, తెలుగు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ విజయభారతి శనివారం కన్నుమూశారు. 1941లో కోనసీమ జిల్లా రాజోలులో జన్మించిన ఈమె.. పద్మభూషణ్ బోయి భీమన్న కుమార్తె, దివంగత సామాజికవేత్త బొజ్జా తారకం సతీమణి. 20పైగా పుస్తకాలు రాసి ఎన్నో పురస్కారాలు పొందారు. ఈమె కుమారుడు రాహుల్ బొజ్జా ప్రస్తుతం TG నీటిపారుదల శాఖ కార్యదర్శిగా ఉన్నారు. విజయభారతి పార్థీవదేహాన్ని గాంధీ మెడికల్ కాలేజ్‌కి ఆదివారం అందజేయనున్నారు.