News September 26, 2024
తూ.గో: 4వరోజు గాలింపు.. రంగంలోకి డాగ్ స్క్వాడ్

ఏలూరు ఆశ్రం వైద్య విద్యార్థులు ఏజెన్సీలోని జలపాతం వద్ద నాలుగు రోజుల కింద గల్లంతైన విషయం తెలిసిందే. వీరిలో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో విద్యార్థి హరదీప్ ఆచూకీ ఇప్పటికి తెలియరాలేదు. అతని కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. జిల్లా అధికారుల సమక్షంలో గురువారం డాగ్ స్క్వాడ్ సిబ్బంది ఏజెన్సీని జల్లెడపట్టారు. అయినా హరదీప్ ఆచూకీ లభ్యం కాకపోవడంతో కుటుంబీకులు ఆందోళనలో ఉన్నారు.
Similar News
News March 1, 2026
రేపు PGRS, రెవిన్యూ క్లినిక్: కలెక్టర్ కీర్తి

రాజమండ్రి కలెక్టరేట్లో సోమవారం PGRS, రెవెన్యూ క్లినిక్‌లను యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ప్రకటించారు. అర్జీదారులు తమ అర్జీలను Meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అర్జీల నమోదు, నమోదైన అర్జీల స్థితి తదితర వివరాలకు 1100కు కాల్ చేయవచ్చని కలెక్టర్ సూచించారు.
News March 1, 2026
తూ.గో: ఇక ఆన్‌లైన్‌లో రవాణా సేవలు

రవాణాశాఖకు సంబంధించిన అన్ని సేవలు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయని తూ.గో రవాణాధికారి ఆర్. సురేశ్ శనివారం తెలిపారు. డ్రైవింగ్ లైసెన్సుల కోసం ‘Sarathi Parivahan’ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. వాహనాల రిజిస్ట్రేషన్, టాక్స్ చెల్లింపుల వంటి సేవలను ‘Vahan Parivahan’ పోర్టల్ ద్వారా పొందవచ్చని వెల్లడించారు. ఇంటి నుంచే పనులు పూర్తి చేసుకోవచ్చని పేర్కొన్నారు.
News February 28, 2026
RJY: ట్రంప్ తీరుపై సీపీఐ నారాయణ ధ్వజం

అమెరికా విధానాలు, ట్రంప్ తీరు వల్ల దేశంలో వ్యవసాయం, చేనేత రంగాలు నాశనమవుతున్నాయని CPI నేత కె.నారాయణ విమర్శించారు. శనివారం రాజమండ్రిలో ఆయన మాట్లాడారు. మోదీ ప్రభుత్వం ట్రంప్‌నకు బానిసగా మారిందని మండిపడ్డారు. సామాన్యులను వదిలేసి కార్పొరేట్లకు కోట్లాది రూపాయల రుణాలు మాఫీ చేస్తూ ఊడిగం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.


