News May 7, 2024

తూ.గో: ALERT.. ఈ ప్రాంతాల్లో పిడుగులకు ఛాన్స్

image

వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ హెచ్చరికలు జారీచేసింది. సామర్లకోట, పెద్దాపురం, ఏజెన్సీ, కోనసీమ, తదితర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజల ఫోన్స్‌కు మెసేజ్‌లు వచ్చాయి. అప్రమత్తంగా ఉండాలని ఆ సందేశంలో పేర్కొన్నారు. గతంలో అనేకసార్లు పిడుగుపాటు ప్రమాదాలు సంభవించాయి.

Similar News

News April 22, 2025

RJY: పోలీస్ సిబ్బందికి డ్రోన్ కెమెరాపై శిక్షణ 

image

తూర్పుగోదావరి జిల్లాలో ఇకపై సాంకేతికత, అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, నేరాల నియంత్రణకు వినూత్న చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ నరసింహ కిషోర్‌ అన్నారు. సోమవారం ఆయన ఆదేశాల మేరకు నేరాల నియంత్రణకు జిల్లా వ్యాప్తంగా ఉపయోగిస్తున్న డ్రోన్‌ కెమెరాల ఆపరేటింగ్‌‌పై సిబ్బందికి జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించారు.

News April 22, 2025

RJY: పోలీస్ సిబ్బందికి డ్రోన్ కెమెరాపై శిక్షణ 

image

తూర్పు గోదావరి జిల్లాలో ఇకపై సాంకేతికత, అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, నేరాలు నియంత్రణకు వినూత్న కార్యకలాపాలు, నేరాల నియంత్రణకు వినూత్న చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ డి.నరసింహకిషోర్‌ అన్నారు. సోమవారం ఆయన ఆదేశాలు మేరకు నేరాల నియంత్రణకు జిల్లా వ్యాప్తంగా ఉపయోగిస్తున్న డ్రోన్‌ కెమెరాల ఆపరేటింగ్‌ పై సిబ్బందికి జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించారు.

News April 21, 2025

అర్జీలు పరిష్కారంలో అసంబద్ధ ఎండార్స్మెంట్లు ఇవ్వొద్దు: కలెక్టర్

image

అర్జీలు పరిష్కారంలో అసంబద్ధ ఎండార్స్మెంట్లు ఇవ్వకూడదని, అటువంటి ఎండార్స్మెంట్లు జారీ చేస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ప్రశాంతి స్పష్టం చేశారు. సోమవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద పీజీఆర్ఎస్ ద్వారా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వస్తున్న అర్జీలను స్వీకరించడం, వాటికి తగిన విధంగా పరిష్కారం చూపాలని అధికారులకు సూచించారు.

error: Content is protected !!