News February 17, 2026
తూ.గో: JEE మెయిన్స్‌లో శ్రీ ప్రకాశ్ విద్యార్థుల ప్రభంజనం

JEE మెయిన్స్ ఫలితాల్లో శ్రీ ప్రకాశ్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. జె.మోనేశ్ కుమార్ 99.93, టి.కృష్ణ 98.44 పెర్సంటైల్ సాధించినట్లు సంయుక్త కార్యదర్శి సీహెచ్ విజయ్ ప్రకాశ్ తెలిపారు. తాము IIT- JEE కోచింగ్ వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. విజేతలను విద్యా సంస్థల అధినేత సిహెచ్.వి.కె నరసింహారావు, ప్రిన్సిపల్ వి.వి.ఎస్.ఎస్ భానుమూర్తి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు.
Similar News
News February 17, 2026
కోనసీమ: సచివాలయం మీద YS జగన్ ఫొటో

NDA కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తున్నా అధికారుల తీరు మారలేదని TDP సీనియర్ నేత చుట్టుగుళ్ల కిషోర్ మంగళవారం ధ్వజమెత్తారు. మామిడికుదురు మండలం పాసర్లపూడి సచివాలయం-2లో మాజీ CM జగన్ చిత్రపటాన్ని తొలగించాలని కోరినా స్పందన లేదని ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
News February 17, 2026
వంటింటి చిట్కాలు

* బొంబాయి హల్వా రుచిగా రావాలంటే ఒక టేబుల్ స్పూన్ శనగపిండిని కలపాలి.
* పచ్చి బటానీ ఉడికించేటప్పుడు కాస్త పంచదార వేస్తే వాటి రుచి పెరుగుతుంది.
* అరటికాయ చిప్స్ కరకరలాడాలంటే వేయించే ముందు వాటిపై ఉప్పు నీటిని చిలకరించాలి.
* ఫ్లవర్ వాజుల్లో నీటిని మార్చినపుడు అందులో కాస్త పంచదార వెయ్యడం వల్ల పూలు వాడిపోకుండా తాజాగా ఉంటాయి.
News February 17, 2026
HYDలో రాజకీయ నేతలు ‘డబుల్ గేమ్’

HYDలో ఆస్తి పన్ను పెంచాలంటే సర్కారుకు చెమటలు పడుతున్నాయి. ARV పెంచుతూ మున్సిపల్ శాఖ నోటీసులు ఇస్తుంటే యజమానులు ‘స్టాండర్డ్ రెంట్’ సాకుతో కోర్టు మెట్లెక్కుతున్నారు. అద్దె నియంత్రణ చట్టం ప్రకారం పాత అద్దెలనే ప్రామాణికంగా తీసుకోవాలని, ఇష్టానుసారం పన్ను వేయకూడదని యజమానుల వాదన. ఏటా వందల రూ.కోట్ల వసూళ్లు నిలిచిపోతున్నాయి. ఓటర్లను నొప్పించలేక ఇటు ఖజానా నింపుకోలేక రాజకీయ నేతలు ‘డబుల్ గేమ్’ ఆడుతున్నారు.


