News October 7, 2024
తూ.గో: TODAY TOP NEWS

*ఆలమూరు: గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం
*పిఠాపురం: బ్యాంకు ఎలక్షన్‌లో కూటమి విజయం
*జాతీయ హ్యాండ్ బాల్ జట్టులో కోనసీమ కుర్రోడు
*కాకినాడ: అన్నదమ్ముల మధ్య ఆస్తి తగదా.. ఒకరు మృతి
*రావులపాలెం: కోడిగుడ్ల లారీ బోల్తా
*కాకినాడ: అచ్చంపేట జంక్షన్ వద్ద యాక్సిడెంట్
*కాకినాడ నుంచి ఈ నెల 15న అరుణాచలానికి బస్సు
*రాజమండ్రి: మోటార్ సైకిల్ దొంగ అరెస్ట్
*ధవళేశ్వరం: 8 కాసుల బంగారు ఆభరణాలు చోరీ
Similar News
News March 29, 2026
రాజమండ్రి: ‘జనగణన డేటా సేకరణ పకడ్బందీగా చేపట్టాలి’

2027 గృహ జనగణన డేటా సేకరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా, పారదర్శకంగా చేపట్టాలని డీఆర్ఓ సీతారామ మూర్తి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ఆర్‌ఎంసీ సమావేశ మందిరంలో 2027 గృహ జనగణన డేటా సేకరణకు సంబంధించి నియమితులైన ఫీల్డ్ ట్రైనర్లకు రెండో విడత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గృహ, జనగణన డేటా సేకరణలో క్షేత్ర శిక్షకులు ప్రధాన పాత్ర పోషించాలని, అందుకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని స్పష్టం చేశారు.
News March 29, 2026
రాజమండ్రి: సమస్యలను కలెక్టర్‌కు తెలపండి

రాజమండ్రి కలెక్టరేట్‌లో మార్చి 30న PGRS రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు యథావిధిగా జరుగుతాయని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం తెలిపారు. కలెక్టరేట్‌తో పాటు డివిజన్, మండల, మున్సిపాలిటీ స్థాయిల్లో అధికారులు అందుబాటులో ఉండి ప్రజల నుండి అర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News March 29, 2026
తూ.గో జిల్లాలో రోజుకు 12,500 సిలిండర్ల పంపిణీ: జేసీ

తూ.గో జిల్లాలో గృహ అవసరాలు & అత్యవసర సేవలకు అవసరమైన ఎల్‌పీజీ సరఫరా నిరంతరాయంగా కొనసాగుతోందని జేసీ వై.మేఘా స్వరూప్ శనివారం తెలిపారు. సంబంధిత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ పంపిణీదారులతో నిరంతరం సమన్వయం అవుతోందని పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లాలో రోజుకు సుమారు 12,000 నుంచి 12,500 వరకు గ్యాస్ సిలిండర్లు 52 పంపిణీదారుల ద్వారా సరఫరా జరుగుతున్నాయని చెప్పారు.


