News December 23, 2024
తూ.గో: TODAY TOP NEWS

రాజమండ్రి: పాపికొండల విహారయాత్రకు ఛార్జ్ రూ.1250
*రాజమండ్రిలో పర్యటించిన కేంద్రమంత్రి రామ్మోహన్
*RCPM: పాఠశాలను తనిఖీ చేసిన మంత్రి సుభాష్
*అనపర్తిలో ఆకట్టుకున్న శాంటా క్లాస్ నృత్యం
*కాకినాడ: PGRSకు 434 అర్జీలు
*రంపచోడవరం: ప్రిన్సిపల్‌పై దురుసు ప్రవర్తన.. PD సస్పెండ్
*అమలాపురం: బైక్‌ను దర్జాగా ఎత్తుకెళ్లిన ఆగంతకుడు
*తుని: ఫ్లైఓవర్ నుంచి రైల్వే ట్రాక్‌పై పడిన లారీ
*రంప: ఉరితాళ్లతో టీచర్ల ఆందోళన
Similar News
News February 1, 2026
తొర్రేడు ప్రజలకు అటవీ అధికారుల హెచ్చరికలు

రాజమండ్రి రూరల్ పరిధిలోని తొరేడు గ్రామస్థులను అటవీశాఖ అధికారులు ఆదివారం హెచ్చరించారు. శనివారం తెల్లవారుజామున అడవి జంతువుల దాడిలో మూడు పశువులు మృతి చెందినట్లు జిల్లా అటవీ అధికారి ప్రభాకరరావు తెలిపారు. రాత్రి సమయాల్లో ప్రజలెవరూ ఒంటరిగా బయటకు వెళ్లవద్దని సూచించారు. పశువులను కోల్పోయిన రైతులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిహారం అందిస్తామని వెల్లడించారు. అధికారులు అప్రమత్తంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
News February 1, 2026
గ్రూప్-1లో ముప్పవరం కెరటం.. రాష్ట్రస్థాయిలో 9వ ర్యాంక్!

నిడదవోలు మండలం డి.ముప్పవరం గ్రామానికి చెందిన మారుతి సుధా శ్రీ రమణి ఏపీపీఎస్సీ గ్రూప్-1 ఫలితాల్లో సత్తా చాటారు. రాష్ట్రస్థాయిలో 9వ ర్యాంక్ సాధించి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్(ACST)గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ నాగదేవి, నాగిరెడ్డి సత్తిపండు, గ్రామ నాయకులు ఆమెను సత్కరించారు. ప్రతిభతో గ్రామానికి కీర్తి తెచ్చిన రమణిని గ్రామస్థులు అభినందనలతో ముంచెత్తారు.
News February 1, 2026
క్షమాపణ చెప్పకుంటే తీవ్ర పరిణామాలు: మంత్రి కందుల

ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మంత్రి కందుల దుర్గేశ్ శనివారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం జోలికొస్తే సహించేది లేదని, తాట తీస్తామని హెచ్చరించారు. అంబటి ఒక ఆంబోతులా ప్రవర్తిస్తూ నీచమైన మాటలు మాట్లాడుతున్నారని, ఇలాగే కొనసాగితే ప్రజలే బుద్ధి చెబుతారని మండిపడ్డారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం మానుకోవాలని ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో హితవు పలికారు.


