News October 24, 2024
తూ.గో: TODAY TOP NEWS

* కొత్తపేట: దుర్గాప్రసాద్ హత్యకేసు వివరాలను వెల్లడించిన డీఎస్పీ
* కాకినాడ: ప్రేమించి మోసం చేశాడని సూసైడ్
* ఆలమూరు: ఉరేసుకుని విద్యార్థిని మృతి.. కేసు నమోదు
* జిల్లాలో ఉచిత డీఎస్సీ శిక్షణకు చర్యలు
* రౌడీషీటర్లను పోషించేది మంత్రి సుభాషే: పిల్లి సూర్యప్రకాశ్
* కాకినాడలో సందడి చేసిన హీరో కిరణ్ అబ్బవరం
* రాష్ట్ర టిడ్కో ఛైర్మన్‌ను కలిసిన ఎమ్మెల్యే నానాజీ
* గోకవరం: పలు గ్రామాల్లో 144 సెక్షన్ అమలు
Similar News
News January 25, 2026
తూ.గో: జనవరి 30, 31 తేదీలలో కోకో కాన్క్లేవ్

ఏపీ ప్రభుత్వం, ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో కోకో కాన్క్లేవ్ – 2026 కార్యక్రమాన్ని జనవరి 30, 31 తేదీలలో ఏలూరులోని బాలాజీ గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్నట్లు తూ.గో జిల్లా ఉద్యాన అధికారి ఎన్.మల్లికార్జునరావు శనివారం తెలిపారు. ఈ కాన్క్లేవ్‌లో కోకో పంటకు సంబంధించిన నాణ్యత మెరుగుదల, పంట కోత అనంతర నిర్వహణ తదితర వాటిపై అవగాహన కల్పిస్తారన్నారు. కోకో రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News January 25, 2026
కొత్త డయాలసిస్ కేంద్రాల జాబితాలో ‘కొవ్వూరు’కు చోటు

శనివారం మంత్రి సత్య కుమార్ ప్రకటించిన ప్రధానమంత్రి నేషనల్ డయాలసిస్ ప్రోగ్రాం కింద కొత్తగా మంజూరైన 5 డయాలసిస్ కేంద్రాల జాబితాలో కొవ్వూరుకు చోటు దక్కింది. ప్రజాప్రతినిధుల విజ్ఞప్తుల మేరకు కొవ్వూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో డయాలసిస్ కేంద్రాన్ని మంజూరు చేసినట్లు తెలిపారు. రూ.85 లక్షలతో యంత్రాలు, పరికరాలు ఏర్పాటు చేస్తామని, గ్రామీణ కిడ్నీ బాధితులకు సాంత్వన చేకూర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నారు.
News January 25, 2026
విశాఖ ఉత్సవంలో హెలీకాప్టర్ రైడ్

విశాఖ ఉత్సవ్‌లో భాగంగా రుషికొండ బీచ్ వద్ద పర్యాటకులకు హెలీకాప్టర్ రైడ్ మంచి అనుభూతిని అందింస్తుంది. ఈ హెలీకాప్టర్‌ను మంత్రి కందుల దుర్గేష్ శనివారం ప్రారంభించారు. ఇన్‌ఛార్జ్ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, MLA శ్రీనివాసరావు, APTDC ఛైర్మన్ బాలాజీ, పర్యాటక శాఖ సెక్రటరీ అజయ్ జైన్‌తో కలిసి సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపట్నం సముద్రతీరాలు, కొండలు, ఆకాశ మార్గం నుంచి హెలికాప్టర్ రైడ్‌లో వీక్షించారు.


