News April 1, 2024
తెగిపోయిన నిజాంసాగర్ కట్ట.. జర్నలిస్ట్ కాలనీలోకి నీళ్లు
ఆర్మూర్‌లోని నిజాంసాగర్ డిస్ట్రిబ్యూటరీ 82-2 కో నంబర్ ప్రధాన కాలువ కట్ట సోమవారం తెల్లవారుజామున తెగిపోయింది. దీంతో కాలువను ఆనుకుని ఉన్న జర్నలిస్ట్ కాలనీలోకి భారీగా నీరు వచ్చి చేరింది. నిజాంసాగర్ ప్రాజెక్టు ద్వారా రైతుల పంటల సాగు కోసం నీటిని చెరువులకు వదిలే సమయంలో ప్రాజెక్టు ప్రధాన కాలువలను ఇరిగేషన్ అధికారులు శుభ్రం చేయకపోవడంతో ఈ సమస్య ఏర్పడిందని కాలనీవాసులు పేర్కొన్నారు.
Similar News
News January 13, 2025
NZB: జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్‌గా పల్లె గంగారెడ్డి
జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్‌గా నిజామాబాద్ జిల్లాకు చెందిన బీజేపీ సీనియర్ నేత పల్లె గంగారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు భారత ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో ఆయన మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. పల్లె గంగారెడ్డి ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతున్నారు. గతంలో బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు.
News January 13, 2025
నిజామాబాద్: బాలుడి గొంతుకోసిన చైనా మాంజా
చైనా మాంజా కమ్మర్పల్లిలో కలకలం రేపింది. సోమవారం ఓ వ్యక్తి గాలిపటం ఎగరవేయగా అది తెగిపోయింది. దానికి కట్టిన చైనా మాంజా ఓ బాలుడి(9) గొంతుకు తగిలి తీవ్ర గాయాలయ్యాయి. బాలుడిని కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బాలుడు ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. తల్లిదండ్రులు మీ పిల్లలు బయట ఆడుకునేటప్పుడు గమనిస్తూ ఉండండి. ప్రమాదాలబారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోండి.
News January 13, 2025
NZB: ఊరు వాడా ఘనంగా భోగి సంబురం
ఉమ్మడి NZB జిల్లాల్లో సంక్రాంతి సంబురాలు షురూ అయ్యాయి. మూడు రోజుల వేడుకల్లో భాగంగా తొలి రోజు సోమవారం భోగి పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఊరు వాడా జనం పొద్దున్నే లేచి భోగి మంటలు వేసుకున్నారు. తమ ఇండ్ల ముందు యువతులు, చిన్నారులు రంగు రంగుల ముగ్గులు వేస్తూ..సందడి చేశారు. అటు యువకులు ఒకరితో ఒకరు పోటీ పడి మరీ గాలి పటాలు ఎగురవేస్తూ..ఎంజాయ్ చేస్తున్నారు.