News August 13, 2025
తెనాలితో గాంధీ మహాత్మునికి ప్రత్యేక అనుబంధం

స్వాతంత్ర్య సంగ్రామంలో భాగంగా గాంధీజీ 3సార్లు తెనాలి వచ్చారు. 1929లో తొలిసారి తెనాలి వచ్చి పట్టణ నడిబొడ్డున సభలో ప్రసంగించారు. అందుకే ఆ ప్రాంతానికి గాంధీచౌక్‌గా నామకరణం చేశారు. 1933లో 2వ సారి వచ్చి రైల్వే స్టేషన్ పడమర వైపున బహిరంగ సభలో ప్రసంగించారు. అనంతరం చెంచుపేటలోని ఇప్పటి శబరి ఆశ్రమాన్ని ప్రారంభించి రాత్రికి ఐతనగర్లో బస చేశారు. 1946లో 3వసారి మద్రాస్ వెళుతూ రైల్వే స్టేషన్లో సేద తీరారు.
Similar News
News August 14, 2025
గుంటూరు జిల్లాలో వర్షపాతం వివరాలు

గుంటూరు జిల్లాలో బుధవారం నుంచి గురువారం వరకు భారీ వర్షాలు కురిశాయి. ఫిరంగిపురం మండలంలో అత్యధికంగా 55.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. తుళ్లూరులో 41 మి.మీ, కొల్లిపర 27.5 మి.మీ, తాడికొండలో 27, గుంటూరు వెస్ట్ ప్రాంతంలో 25.75 మి.మీల వర్షపాతం నమోదైంది. మంగళగిరి ఎస్ఆర్ఎం యూనివర్శిటీలో 22.5 మి.మీ, పొన్నూరు 19.5, దుగ్గిరాల 18, తెనాలి 15 మి.మీ చొప్పున వర్షం కురిసినట్టు వాతావరణ శాఖ తెలిపింది.
News August 14, 2025
గుంటూరు మిర్చి యార్డులో నేటి ధరలివే

గుంటూరు మిర్చి యార్డుకు గురువారం సుమారు 55 వేల బస్తాల వరకు ఏసీ సరుకు చేరుకుంది. కేజీల వారిగా ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేజ బెస్ట్: రూ. 80-120, తేజ ఏ/సి: రూ. 125-143, 355 ఏ/సి: రూ. 100-135 వరకు ఉంది. 2043 ఏ/సి: రూ. 120-135, 341 ఏ/సి: రూ. 120-150, షార్కు ఏ/సి: రూ. 110-130, నంబర్ 5 ఏ/సి: రూ. 125-142, డీడీ రకం ఏ/సి: రూ. 110-140, ఎల్లో రకం: రూ. 200-230, బుల్లెట్: రూ. 90-135 వరకు ధర లభించింది.
News August 14, 2025
గుంటూరులో నకిలీ నోట్ల ముఠా అరెస్టు

బాపట్ల వాసి బక్క గోపిని పట్టాభిపురం పోలీసులు నకిలీ నోట్లు మార్చుతుండగా అరెస్ట్ చేశారు. రత్నగిరి నగర్‌లో నివాసం ఉంటున్న గోపికి హైదరాబాద్‌కు చెందిన భరత్ ద్వారా కలకత్తా వాసి గోపాల్ పరిచయమయ్యాడు. గోపాల్ వద్ద నుంచి గోపి 160 నకిలీ రూ.500 నోట్లు కొనుగోలు చేసి గుంటూరులో మార్చుతున్నాడు. పోలీసులు అతడి వద్ద నుంచి 25 నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, రిమాండ్ విధించారు.