News January 6, 2026

తెనాలిలో ఉద్రిక్త వాతావరణం

image

తెనాలి వహాబ్ చౌక్‌లో ఉద్రిక్తత నెలకొంది. డివైడర్ మధ్యలో ఉన్న ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఫొటోలతో ఉన్న ఫ్లెక్సీలు తొలగించేందుకు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సిబ్బంది ప్రయత్నించడంతో టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. నాయకులు, కార్యకర్తలు భారీగా వహాబ్ చేరుకొని రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. కుట్రపూరితంగా ఫ్లెక్సీలు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు.

Similar News

News February 11, 2026

సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించాలి: కలెక్టర్

image

స్వర్ణాంధ్ర @2047లో భాగంగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి కృషి చేయాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్‌పై అధికారులకు కలెక్టరేట్‌లో బుధవారం శిక్షణా కార్యక్రమం జరిగింది. కీలక పనితీరు సూచికలను సాంకేతికత ఆధారిత పనితీరును పర్యవేక్షణ జరుగుతుందన్నారు. ఆర్థిక, సామాజిక కొలమానాలు, లాజిస్టిక్స్, మానిటరింగ్ మెకానిజం అభివృద్ధి చేసుకోవాలన్నారు.

News February 11, 2026

ANU దూరవిద్య పరీక్షల్లో పకడ్బందీ నిఘా

image

ఆచార్య నాగార్జున వర్సిటీ దూరవిద్య పరీక్షలను పటిష్ఠంగా నిర్వహిస్తున్నట్లు పరీక్షల సమన్వయకర్త రామచంద్రన్ తెలిపారు. పరీక్షల పర్యవేక్షణకు రాష్ట్రవ్యాప్తంగా ఏడు తనిఖీ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని ఓ కేంద్రంలో కాపీయింగ్‌కు పాల్పడుతున్న 9 మంది విద్యార్థులపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని విద్యార్థులను హెచ్చరించారు.

News February 11, 2026

GNT: మార్చి 1న ‘ఎన్టీఆర్ స్టేడియం’ ఎన్నికలు

image

బృందావన్ గార్డెన్స్‌లోని ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్ సొసైటీ పాలకవర్గ ఎన్నికలను మార్చి 1న నిర్వహించనున్నట్లు డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 12న ఓటర్ల జాబితా విడుదల చేసి, 13న నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. ఈ ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ సహా మొత్తం 8 మంది సభ్యులను ఎన్నుకోనున్నట్లు ఆయన వెల్లడించారు.