News March 18, 2025
తెనాలిలో ఎన్నారై కుటుంబంలో విషాదం

అమెరికా నార్త్ కరోలినాలో తెనాలికి చెందిన ఎన్నారై కుటుంబంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. తెనాలి అయితానగర్‌కు చెందిన గడ్డం థామస్ కుమార్తె షారోన్ సధానియేల్‌కు, అమెరికాకు చెందిన సథానియేల్ లివిస్కాతో 2007లో వివాహం కాగా అమెరికాలో ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. తుఫాను కారణంగా భారీ వృక్షం కూలి వీరి ఇంటిపై పడటంతో ఇంట్లో నిద్రిస్తున్న కుమారులు మృతి చెందారు.
Similar News
News November 7, 2025
పెదనందిపాడు: ప్రభుత్వ ఆడిటర్ ఇంట్లో సీబీఐ సోదాలు

పెదనందిపాడు మండలం పుసులూరు గ్రామంలో శుక్రవారం సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. ప్రభుత్వ ఆడిటర్ గుమ్మడిల్లి శివ నాగేశ్వరరావు నివాసంలో సోదాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం అధికారులు ఆయన ఇంట్లోనే తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల వెనుక కారణాలు తెలియాల్సి ఉంది. స్థానికంగా ఈ ఘటన కలకలం సృష్టిస్తోంది. పూర్తి వివరాలు అధికారులు వెల్లడించిన తర్వాత తెలియనున్నాయి.
News November 7, 2025
దుగ్గిరాల పసుపు యార్డులో ధరలు ఇలా..!

దుగ్గిరాల యార్డు పసుపుకు పెట్టింది పేరు. అయితే పసుపు యార్డులో ధరలు గురువారం జరిగిన వేలంలో ఈ విధంగా నమోదయ్యాయి. కొమ్ములు క్వింటాకు కనిష్ఠ ధర రూ.10,800, గరిష్ఠ ధర రూ.12,500, మోడల్ ధర రూ.12,500 పలికాయి. కాయ క్వింటాల్‌కు కనిష్ఠ ధర రూ.11,800, గరిష్ఠ ధర రూ.12,400, మోడల్ ధర రూ.12,400 పలకగా, మొత్తం 218 బస్తాల పసుపును రైతులు వ్యాపారులకు విక్రయించారని సిబ్బంది చెప్పారు.
News November 7, 2025
GNT: రచనలను, ఉద్యమాలే ఆయన జీవిత ధ్యేయం

ప్రముఖ అభ్యుదయ సినీ రచయిత, ప్రజా కళాకారుడు, కమ్యూనిస్టు నాయకుడు బొల్లిముంత శివరామకృష్ణ నవంబర్ 27, 1920 సంవత్సరంలో ఉమ్మడి గుంటూరు జిల్లా చదలవాడలో జన్మించారు. సమాజంలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో రచనలను, ఉద్యమాలను తన జీవిత ధ్యేయంగా మార్చుకున్నారు. ఆయన రచనల్లో తెలంగాణ సాయుధ పోరాటం, సామాజిక అన్యాయాలు, రైతుల కష్టాలు స్పష్టంగా కనిపిస్తాయి. సినీ రచయితగా ‘నిమజ్జనం’కి జాతీయ అవార్డు లభించాయి.


