News October 14, 2025
తెనాలిలో హత్య.. మృతుని వివరాలు..!

తెనాలి చెంచుపేటలోని కైలాశ్ భవన్ రోడ్డులో బుజ్జిని పట్ట పగలే హత్య చేసిన విషయం తెలిసిందే. మాస్క్ ధరించి స్కూటీపై వచ్చిన వ్యక్తి హత్య చేసి పరారైనట్లు స్థానికులు చెప్తున్నారు. కాగా మృతుడు బాపట్ల జిల్లా అమృతలూరు (M) కోడితాడిపర్రుకి చెందిన వాసిగా పోలీసులు గుర్తించారు. మృతుడు తమ కుమార్తెను చూసేందుకు చెంచుపేటకు వచ్చినట్లు సమాచారం.
Similar News
News October 14, 2025
రామాయంపేట: ‘ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతంగా పూర్తి చేయాలి’

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు సూచించారు. రామాయంపేట మండలం కోనాపూర్‌లో మంగళవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇందిరమ్మ లబ్ధిదారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన కొలతల ప్రకారం నిర్మాణం చేపడితే సకాలంలో బిల్లులు చెల్లిస్తామని పేర్కొన్నారు.
News October 14, 2025
రామాయంపేట: గిట్టుబాటు ధర కోసం ధాన్యం కొనుగోలు కేంద్రాలు

రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం కోసమే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రామాయంపేట మండలం కోనాపూర్‌లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రారంభించారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలన్నారు.
News October 14, 2025
జూబ్లీహిల్స్‌లో ఎంఐఎం పోటీపై ఒవైసీ కీలక ప్రకటన

జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు MIM అభ్యర్థిపై ఒకటి, రెండురోజుల్లో నిర్ణయం ప్రకటిస్తామని అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. పదేళ్ల BRS పాలనలో జూబ్లీహిల్స్‌లో అభివృద్ధి లేదన్న ఆయన.. BRS నుంచి ఇక్కడ మంత్రి ఉన్నప్పటికీ కనీస సౌకర్యాలు కూడా కల్పించలేకపోయారన్నారు. బీజేపీకి పాజిటివ్‌గా ఉండటానికి తాను అభ్యర్థిని నిలబెడతాననే విమర్శలు వస్తాయన్న ఆయన.. కాంగ్రెస్‌కు తాము ఎలా మద్దతు ఇస్తామని ప్రశ్నించారు.