News October 16, 2025
తెనాలి: ఆధిపత్య పోరుతో అన్యాయంగా చంపేశారు..?

అమృతలూరు(M) కోరుతాడిపర్రుకు చెందిన జూటూరి తిరుపతిరావు@ బుజ్జి తెనాలిలో మంగళవారం దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. సంచలనం రేకెత్తించిన హత్య కేసును పోలీసులు ఛేదించినట్టు తెలుస్తోంది.గ్రామంలోని రామాలయం విషయంలో ఆధిపత్య పోరుతో సమీప బంధువే ఈ హత్యకు పాల్పడ్డాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. పక్కా ఆధారాలతో నిందితుడిని గుర్తించిన పోలీసులు చాకచక్యంగా అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది
Similar News
News October 16, 2025
శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ సందర్శించిన నాగబాబు

శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌ను ఎమ్మెల్సీ నాగబాబు సందర్శించారు. కాంప్లెక్స్ ఆవరణలో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వర్షపు నీరు నిల్వతో ప్రయాణికులకు ఇబ్బందిగా మారడంపై ఆరా తీస్తున్నారు. తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందితో చర్చించారు. ఆయన వెంట సుడా ఛైర్మన్ కొరికాన రవికుమార్, నాయకులు ఉన్నారు.
News October 16, 2025
కృష్ణా: మన బందరు లడ్డు చరిత్ర ఇదే

నేడు ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా 2017లో జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్(GI) టాగ్ తెచ్చుకున్న మన బందరు లడ్డు చరిత్ర మీకు అందిస్తున్నాం. 17వ శతాబ్దంలో బుందేల్‌ఖండ్(UP) నుంచి బందరుకు వలస వచ్చిన రామ్‌సింగ్ కుటుంబం తొలుత ఈ లడ్డులు ఇక్కడ విక్రయించేవారు. వారి నుంచి స్థానికంగా నివసిస్తున్న వ్యాపారాలు బందరు లడ్డులను తయారుచేస్తూ మన బందరు లడ్డు ఖ్యాతిని దశదిశలా విస్తరింపచేశారు.
News October 16, 2025
ఆది శ్రీనివాస్‌కు మంత్రి పదవి..? సాధ్యమేనా..?

<<18020734>>కొండా సురేఖ<<>>ను మంత్రి పదవి నుంచి తప్పించడం/ రాజీనామా చేయిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే BC వర్గానికి చెందిన సురేఖ ప్లేస్‌ను అదే సామాజిక వర్గానికి చెందిన వేములవాడ MLA ఆది శ్రీనివాస్‌తో భర్తీ చేస్తారన్న చర్చ పొలిటికల్ సర్కిల్లో నడుస్తోంది. CMకి సన్నిహితుడిగా, వివాదరహితుడిగా ఆదికి పేరుంది. అయితే ఇప్పటికే ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురు మంత్రులున్న నేపథ్యంలో నాల్గో మంత్రి పదవి సాధ్యమేనా? చూడాలి.