News October 26, 2025

తెనాలి: చంద్రబాబు, లోకేశ్‌పై పోస్టులు.. కేసు నమోదు

image

ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లపై ట్విట్టర్‌లో అనుచిత పోస్ట్‌లు పెడుతున్న వ్యక్తిపై తెనాలిలో కేసు నమోదైంది. ఉపేంద్ర ధర్మ అనే హ్యాండిల్ ద్వారా పోస్ట్‌లు పెడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని పట్టణ టీడీపీ బీసీ సెల్ అధ్యక్షుడు దుర్గా ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు టూ టౌన్ సీఐ రాముల నాయక్ శనివారం రాత్రి కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ చేపట్టారు.

Similar News

News October 26, 2025

గుంటూరు: ‘ఈ సమస్యలు వస్తే కాల్ చేయండి’

image

గృహ హింస చట్టం 2006 అక్టోబర్ 26 అమలులోకి వచ్చింది. ఇందులో భాగంగా మహిళల రక్షణ, న్యాయం కోసం అధికారుల పర్యవేక్షణలో కఠిన చర్యలు కొనసాగుతున్నాయి. మహిళలపై హింస, వేధింపులు, దౌర్జన్యాలు ఎదురైనప్పుడు వెంటనే ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో గుంటూరు ప్రాజెక్ట్ డైరెక్టర్ గృహ హింస చట్టం శాఖను సంప్రదించవచ్చు. లీగల్ కౌన్సిలర్ : 8639687689, సోషల్ కౌన్సిలర్: 8074247444.

News October 25, 2025

గుంటూరు జిల్లాలో స్కూళ్లకు 3 రోజులు సెలవులు

image

మెంథా తుపాన్ దృష్ట్యా 27, 28,29 తేదీల్లో పాఠశాలలకు కలెక్టర్ తమీమ్ అన్సారియా సెలవు ప్రకటించారు. తల్లిదండ్రులు చిన్నారులను బయటకు పంపొద్దన్నారు. ప్రజలు తుపాన్ దృష్ట్యా ఇంటి వద్దనే ఉండాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ 0863 2234014 ఏర్పాటు చేశామని దీంతోపాటు డివిజన్ మండల స్థాయిలోనూ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామని చెప్పారు.

News October 25, 2025

సెస్సు బకాయిలపై దృష్టి సారించాలి: జేసీ

image

గ్రంథాలయ సెస్సు బకాయిల వసూళ్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. గ్రంథాలయ సెస్సు సమీక్షా సమావేశం శనివారం కలెక్టరేట్‌లో జరిగింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో గ్రంథాలయ సంస్థ సెస్సు బకాయిలు రూ. 64, 36,14,822లు ఉన్నాయని చెప్పారు. సెస్ బకాయిలు తక్షణమే వసూలు చేయాలని జేసీ ఆదేశించారు.