News April 1, 2025

తెనాలి: దైవ దర్శనానికి వెళుతూ అనంత లోకాలకు

image

కృష్ణా జిల్లా పులిగడ్డ వారిధి వద్ద సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందడంతో తెనాలిలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. చెంచుపేటకు చెందిన రవీంద్ర మోహన బాబు కుటుంబంతో సహా కారులో మోపిదేవి ఆలయానికి వెళుతుండగా ప్రమాదం జరిగింది. 21 రోజుల పసికందుతో సహ రవీంద్ర, అతని భార్య అరుణ, మనుమరాలు(5) ప్రమాదంలో మృతిచెందారు. ఒకే కుటుంబంలో నలుగురు మృతిచెందడంతో తీవ్ర విషాదం నెలకొంది. 

Similar News

News April 2, 2025

తాడేపల్లిలో వైఎస్ జగన్ కీలక సమావేశం

image

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో సమావేశమయ్యారు. సమావేశానికి వివిధ జిల్లాల నేతలు హాజరయ్యారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీ తరఫున గెలిచిన వారిని అభినందించిన జగన్, భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. రాబోయే ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రజల్లో కొనసాగాలని నేతలకు సూచించారు.

News April 2, 2025

వెలగపూడిలో తిరుమల తిరుపతి దేవస్థానంపై సీఎం సమీక్ష

image

తిరుమల తిరుపతి దేవస్థానంపై సీఎం నారా చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. బుధవారం వెలగపూడిలోని సచివాలయంలో జరిగిన ఈ సమీక్షకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు హాజరయ్యారు. సమావేశంలో భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి తీసుకోవాల్సిన చర్యలు, ఆలయ భద్రత, దర్శన వ్యవస్థలో మార్పులు, భక్తుల వసతి ఏర్పాట్లు వంటి అంశాలపై సీఎం చర్చించారు.

News April 2, 2025

GNT: ఉద్యోగాల జాబితా విడుదల

image

గుంటూరు DMHO కార్యాలయం పరిధిలో వివిధ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారి తుది మెరిట్ జాబితాను విడుదల చేసినట్లు DMHO విజయలక్ష్మి మంగళవారం తెలిపారు. DEO, LGS, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్టు, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల ఫైనల్ మెరిట్ లిస్టును guntur.ap.gov.in లో అప్ లోడ్ చేసినట్లు తెలిపారు. ROR ప్రకారం లిస్ట్‌లో ఉన్న అభ్యర్థులకు కౌన్సెలింగ్ తేదీని త్వరలో తెలియజేస్తామన్నారు.

error: Content is protected !!