News December 19, 2025

తెనాలి రూరల్ సీఐ నాయబ్ రసూల్‌కు డీజీపీ ప్రశంసలు

image

తెనాలి రూరల్ సీఐ షేక్ నాయబ్ రసూల్‌ను డీజీపీ హరీష్ గుప్తా అభినందించారు. గతంలో ఐటీ కోర్ ఎస్ఐగా పని చేస్తుండగా బాపట్ల రూరల్ పీఎస్ పరిధి సూర్యలంకలోని హరిత రిసార్ట్ వెబ్‌సైట్‌ను పోలిన ఫేక్ వెబ్ సైట్లు ఉపయోగించి ప్రజలను మోసం చేస్తున్న ముఠాను పట్టుకోవడంలో నాయబ్ రసూల్ చేసిన కృషిని కొనియాడుతూ బెస్ట్ ఇన్ క్రైమ్ డిటెక్షన్ అవార్డును డీజీపీ అందజేసి అభినందించారు. ఇదే ముఠాపై దేశ వ్యాప్తంగా 127 కేసులు ఉన్నాయి.

Similar News

News December 19, 2025

అమరావతి పెట్టుబడులపై మలేషియా బృందంతో చర్చలు

image

రాజధాని అమరావతిలో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా సీఆర్డీఏ అదనపు కమిషనర్ అమిలినేని భార్గవ్ తేజ శుక్రవారం మలేషియా బృందంతో సమావేశమయ్యారు. రాయపూడిలోని కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో రాజధాని నిర్మాణ పురోగతిని, ప్రభుత్వం అనుసరిస్తున్న పెట్టుబడిదారుల అనుకూల విధానాలను వివరించారు. 2026 జనవరి ప్రథమార్థంలో అమరావతిలో భారీ పెట్టుబడుల సదస్సు నిర్వహణపై ఈ సందర్భంగా కీలక చర్చలు జరిపారు.

News December 19, 2025

గుంటూరు జిల్లా విద్యాశాఖలో క్రమశిక్షణ చర్యలు

image

గుంటూరు జిల్లాలో హెచ్‌ఎం/స్కూల్ అసిస్టెంట్ల పదోన్నతుల విషయంలో విద్యాశాఖ నిబంధనలను ఉల్లంఘించి అవకతవకలకు పాల్పడినట్లు అభియోగాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో క్రమశిక్షణ చర్యలలో భాగంగా అప్పటి డీఈఓగా పనిచేసిన గంగాభవానితో పాటు మరో ఏడుగురు అధికారులపై విచారణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ (సీసీఏ) రూల్స్-1991లోని రూల్ నంబర్ 20 ప్రకారం విచారణ నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేశారు.

News December 19, 2025

రేపు టీడీపీ కేంద్ర కార్యాలయానికి నారా లోకేశ్

image

మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయానికి రానున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే ప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి వచ్చే అర్జీలను ఆయన స్వీకరించనున్నారు. అలాగే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడితో లోకేశ్ భేటీ కానున్నారు. పార్టీ వ్యవహారాలు, ప్రజా సమస్యలపై చర్చ జరగనున్నట్లు సమాచారం.