News February 16, 2025

తెనాలి: రైలు ఢీకొని మహిళ దుర్మరణం

image

తెనాలి మండలం కొలకలూరు రైల్వే స్టేషన్‌లో దారుణం జరిగింది. పట్టాలు దాటుతుండగా కొలకలూరుకు చెందిన పద్మావతి(55) అనే మహిళను సూపర్ ఫాస్ట్ రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించింది. విజయవాడ నుంచి ఒంగోలు వెళ్లే ప్యాసింజర్ ఎక్కేందుకు వచ్చిన పద్మావతి స్టేషన్ వద్ద పట్టాలు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి చెన్నై వెళ్లే సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టినట్లు తెలుస్తోంది. 

Similar News

News February 20, 2026

గుంటూరులో స్టూడెంట్ అదృశ్యం..!

image

వేదపాఠశాల విద్యార్థి అదృశ్యమైనట్లు అరండల్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు. బాపట్ల (D) సంతమాగులూరు (M) మిన్నెకల్లుకు చెందిన పదిహేనేళ్ల తుర్లపాటి వెంకటసాయి రమేశ్ ఎండ్రాయి వేదపాఠశాలలో చదువుతున్నాడు. రెండ్రోజుల కిందట పాఠశాల నుంచి గుంటూరు శ్రీనగర్‌లోని అమమ్మ ఇంటికి వచ్చాడు. 18న లాడ్జిసెంటర్‌లో ఆటో ఎక్కి కనిపించకుండా పోయాడు. విద్యార్థి తల్లి పద్మప్రియ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామన్నారు.

News February 19, 2026

అమరావతిలో పలు సంస్థలకు భూములు

image

అమరావతిలో వివిధ సంస్థలకు సబ్ కమిటీ భూములు కేటాయించింది. రెయిన్‌బో ఆసుపత్రికి 2ఎకరాలు, వాతావరణ శాఖ, నాబార్డ్‌లకు ఎకరం చొప్పున స్థలాలు ఇచ్చారు. పీఎన్‌బీ, కరూర్ వైశ్యా బ్యాంకులకు కూడా భూములు దక్కాయి. మొత్తం 22 ప్రతిపాదనలు చర్చించి, 7 కొత్త సంస్థలకు ఆమోదం తెలిపారు. 11 పాత కేటాయింపుల్లో మార్పులు చేశారు. బ్యాంకు ఉద్యోగుల ఇళ్లకూ అనుమతిచ్చారు. ఇప్పటికే స్థలాలు పొందిన సంస్థల నిర్మాణ పురోగతిపై సమీక్షించారు.

News February 19, 2026

ANU: బీ ఆర్కిటెక్చర్ సప్లమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో గత నవంబర్ నెలలో జరిగిన బీ ఆర్కిటెక్చర్ సప్లమెంటరీ పరీక్షల ఫలితాలను గురువారం పరీక్షల నిర్వహణ అధికారి శివప్రసాదరావు విడుదల చేశారు. 5/5 బీ ఆర్కిటెక్చర్ 2వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు తెలిపారు. రీవాల్యుయేషన్ కు దరఖాస్తులు ఈ నెల 27వ తేదీలోగా అందించాలని సూచించారు. వివరాలకు వర్సిటీ వెబ్సైట్ https://www.nagarjunauniversity.ac.in సంప్రదించాలన్నారు.