News January 4, 2026
తెనాలి: షార్ట్ ఫిల్మ్ పోటీలకు భారీ స్పందన

తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఈ నెల 11న నిర్వహించనున్న మా-ఏపీ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు అపూర్వ స్పందన లభించిందని దర్శకుడు దిలీప్ రాజ తెలిపారు. ఆదివారం తెనాలిలో ఆయన మాట్లాడుతూ.. వివిధ ప్రాంతాల నుంచి 203 లఘు చిత్రాలు పోటీకి వచ్చాయన్నారు. యువతలోని సృజనాత్మకతను వెలికితీసేందుకు ఈ వేదికను సిద్ధం చేశామన్నారు. ప్రతిభ కనబరిచిన విజేతలకు సినీ, కళారంగ ప్రముఖుల జ్ఞాపకార్థం నగదు బహుమతులు అందజేస్తామన్నారు.
Similar News
News February 4, 2026
‘SDG సూచికల లక్ష్యాలు 100 శాతం అధిగమించాలి’

జిల్లాలో స్వర్ణాంధ్ర సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించిన సూచికలు 100 శాతం అధిగమించేలా అన్ని శాఖలు ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని గుంటూరు కలెక్టర్ అన్సారియా అన్నారు. బుధవారం కలెక్టరేట్ వీసీ సమావేశ మందిరంలో అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. అభివృద్ధి లక్ష్యాల సూచికలను 100 శాతం సాధించాలన్నారు. సమావేశంలో ZP CEO జ్యోతిబస్ పాల్గొన్నారు.
News February 4, 2026
GNT: అమరజీవి స్మారకానికి మునిమనవరాలి విరాళం

అమరావతిలో 58 అడుగుల ఎత్తైన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి కాంస్య విగ్రహ నిర్మాణానికి అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్‌కు 58 లక్షల రూపాయల విరాళాన్ని పొట్టి శ్రీరాములు గారి మునిమనవరాలు కుందా ప్రతిభ ప్రకటించారు. ఈ సందర్భంగా కుందా ప్రతిభ, కుంద ప్రతాప్‌కి ట్రస్ట్ సభ్యులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ విరాళం విగ్రహ నిర్మాణానికి కీలకంగా నిలవనుందని పేర్కొన్నారు.
News February 4, 2026
గుంటూరు మిర్చి యార్డు కమిటీకి గ్రీన్‌సిగ్నల్!

చాలా రోజులుగా కొనసాగుతున్న సందిగ్ధానికి తెరపడింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు గుంటూరు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ (AMC) ఏర్పాటు ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. టీడీపీ నుంచి ఛైర్మన్‌గా కర్రా అప్పారావు, జనసేన నుంచి వైస్ ఛైర్మన్‌గా బిట్రగుంట మల్లికను నియమించారు. అదనంగా 13 మంది కమిటీ సభ్యుల నియామకాన్ని ఖరారు చేశారు.


