News October 14, 2025
తెనాలి హత్య కేసులో నిందితుడి గుర్తింపు.. ప్రత్యేక బృందాలతో గాలింపు

తెనాలి చెంచుపేటలో ఉదయం జరిగిన తిరుపతిరావు హత్య కేసులో పోలీసులు కొన్ని కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. నిన్న రాత్రే బాధ్యతలు తీసుకున్న త్రీ టౌన్ సిఐ సాంబశివరావు ఉదయాన్నే హత్య జరగడంతో కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సిసి కెమెరాల ద్వారా అనుమానితుడిని గుర్తించి ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. పోలీస్ డాగ్ సింబా స్పాట్ నుండి పక్క వీధి మీదగా డొంకరోడ్డు ఎంట్రన్స్ వద్దకు వచ్చి ఆగింది.
Similar News
News October 15, 2025
ధాన్యం కొనుగోళ్లు పారదర్శకతతో చేపట్టాలి : కలెక్టర్

జిల్లాలో ధాన్యం కొనుగోలు పారదర్శకతతో చేపట్టాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. ధాన్యం సేకరణపై జిల్లా కలెక్టరేట్లో అధికారులతో మంగళవారం కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కొనుగోలు కార్యకలాపాలు ప్రారంభమయ్యే ముందే గోనె సంచులు, రవాణా వాహనాలు సిద్ధంగా ఉంచాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో గోనెసంచులు అందుబాటులో లేకపోవడం, రవాణాలో ఆలస్యం, చెల్లింపుల్లో జాప్యం అనే ఫిర్యాదులు రాకుండా చూడాలన్నారు.
News October 14, 2025
యుద్ధ విన్యాసాలు చేస్తూ గుంటూరు సైనికుడు మృతి

రాజస్థాన్‌లోని సైనిక స్థావరంలో యుద్ధ విన్యాసాలు చేస్తూ గుంటూరు సంగడిగుంటకు చెందిన తేజ్ భరద్వాజ్ మరణించారు. దేశ సేవపై మక్కువతో సైన్యంలో చేరిన భరద్వాజ్ ప్రమాదవశాత్తు మరణించడం సైన్యం, కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహం ఇవాళ సాయంత్రానికి సంగడిగుంటలోని నివాసానికి తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు.
News October 14, 2025
తెనాలి: రంగంలోకి దిగిన డాగ్ స్క్వాడ్

తెనాలి చెంచుపేటలో సంచలనం రేకెత్తించిన జూటూరి తిరుపతిరావు హత్య కేసు నిందితుని కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దింపారు. మృతుని స్వగ్రామం కోడితాడిపర్రులో సొసైటీ దేవాలయానికి సంబంధిన వ్యవహారంలో విభేదాల కారణంగా హత్య జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. మృతదేహానికి ఘటనా స్థలంలోనే పంచనామా నిర్వహిస్తున్నారు.