News December 26, 2025

తెప్పోత్సవం ఘాట్ వద్ద ప్రత్యేక కార్యక్రమాలు

image

ఏరు రివర్ ఫెస్టివల్‌లో భాగంగా రేపు సాయంత్రం 4 గంటల నుంచి భద్రాచలం తెప్పోత్సవ ఘాట్ వద్ద ప్రత్యేక సాంస్కృతిక, నది హారతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. సుమారు 230 మంది లోకల్ యువత పాల్గొనే ఫ్లాష్ మోబ్ పెర్ఫార్మెన్స్ ప్రధాన ఆకర్షణగా ఉంటుందని పేర్కొన్నారు. యువత సృజనాత్మకతను ప్రోత్సహించడంతో పాటు, నదుల పట్ల అవగాహనను పెంపొందించే విధంగా ఉంటాయని చెప్పారు.

Similar News

News December 31, 2025

ASF: ‘కొత్త వ్యక్తుల వెరిఫికేషన్ తప్పనిసరి’

image

ఇళ్లలో వంట మనుషులు, వాచ్‌మెన్‌లు, కార్మికులుగా అపరిచితులను నియమించుకునేటప్పుడు పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరి అని ఆసిఫాబాద్ ఎస్పీ నితికా పంత్ సూచించారు. కొత్త వ్యక్తుల గత చరిత్ర, ప్రవర్తన, నేర నేపథ్యం తెలుసుకోవడం వల్ల భద్రత ఉంటుందని పేర్కొన్నారు. ఇంటిని అద్దెకు ఇచ్చే ముందు కూడా అద్దెదారుల వివరాలను పోలీసులకు తెలపాలన్నారు. ఈ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రజల రక్షణ కోసమేనని, అందరూ సహకరించాలని కోరారు.

News December 31, 2025

మేడారం జాతరకు 12వేల మందితో బందోబస్తు: ఎస్పీ

image

మేడారం జాతరలో 12వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ సుధీర్ కేకన్ తెలిపారు. మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ పర్యవేక్షణలో 20 మంది ఐపీఎస్ అధికారులు పనిచేస్తారని వెల్లడించారు. తొలిసారిగా డ్రోన్ కామాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేశామన్నారు. 20 డ్రోన్లతో ట్రాఫిక్, క్రౌడ్ కంట్రోల్ మేనేజ్మెంట్ అమలు చేస్తామని చెప్పారు. 460 సీసీ కెమెరాలతో లైవ్ గస్తీ నిర్వహిస్తామని తెలిపారు.

News December 31, 2025

సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేయాలి: కలెక్టర్

image

ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన బనగానపల్లి రెవెన్యూ డివిజన్‌ బుధవారం నుంచి అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించింది. అమరావతి సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్వహించిన సమీక్షలో జిల్లా కలెక్టర్ రాజకుమారి పాల్గొన్నారు. కొత్త డివిజన్ ద్వారా ప్రజలకు పాలన మరింత చేరువవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆమె ఆదేశించారు.