News April 29, 2024
తెర్లాం: చికిత్స పొందుతూ VRO మృతి

బాడంగి మండలంలో వీఆర్వోగా పనిచేస్తున్న రాజయ్యపేటకుగ్రామానికి చెందిన ఏవీఎస్ డీకే రాజు (58) ఆదివారం మృతి చెందారు. ఇటీవల విధుల నిమిత్తం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. విశాఖలో చికిత్స పొందుతూ , ఇతర అనారోగ్య సమస్యలతో పరిస్థితి విషమించి మృతి చెందారు. ఆయనకు వీఆర్వోల సంఘం సంతాపం ప్రకటించింది.
Similar News
News April 21, 2025
తెట్టంగిలో బంగారం చోరీ

గుర్ల మండలంలోని తెట్టంగిలో ఐదున్నర తులాల బంగారం దొంగతనం అయినట్లు ఎస్సై పి.నారాయణ రావు సోమవారం తెలిపారు. తెట్టంగికి చెందిన జమ్ము పాపి నాయుడు ఇంట్లో ఈ దొంగతనం జరిగిందని చెప్పారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌లతో పూర్తి స్థాయిలో పరిశీలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు ఎస్సై చెప్పారు.
News April 21, 2025
విజయనగరం: కేటగిరీల వారీగా పోస్టులు వివరాలు

ఉమ్మడి విజయనగరం జిల్లాలో డీఎస్సీ ద్వారా 446 పోస్టులు భర్తీ చేయనున్న విషయం తెలిసిందే. కేటగిరిలా వారీగా పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.➤ OC-184 ➤ BC-A:33 ➤ BC-B:43➤ BC-C:3 ➤ BC-D:31 ➤ BC-E:16➤ SC- గ్రేడ్1:10 ➤ SC-గ్రేడ్2:29➤ SC-గ్రేడ్3:31 ➤ ST:26 ➤ EWS:40 NOTE సజ్జెక్టుల వారీగా వివరాల కోసం ఇక్కడ <<16156073>>కిక్ల్<<>> చేయండి.
News April 21, 2025
రాజాం: జనసేన నాయకుడిపై అట్రాసిటీ కేసు నమోదు

మండలంలోని ఒమ్మి గ్రామానికి చెందిన చిత్తరి నాగరాజు రాజాంలోని ఆర్కే కాంప్లెక్స్‌లో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కార్డులు ఇస్తున్నారని వెళ్లారు. జనసేన నాయకుడు పొగిరి సురేశ్ బాబు తనను ఇక్కడికెందుకు వచ్చావని కులం పేరుతో తిట్టి, అతని అనుచరులతో దాడి చేయించాడని రాజాం పోలీసు స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేశాడు. ఎస్ఐ రవి కుమార్ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.