News April 3, 2026
తెలంగాణలో కొత్త పెన్షన్ చెల్లింపు విధానం..!

2026-27 కొత్త ఆర్థిక సంవత్సరంలో పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులకు పింఛన్లు చెల్లించడంలో TG GOVT E-PPO (ఎలక్ట్రిక్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్) అనే ఓ కొత్త విధానాన్ని 2 నెలల్లో ప్రవేశపెట్టనుంది. తద్వారా పెన్షన్‌దారులు ఆఫీస్‌కు వెళ్లకుండా తమ వివరాలను నేరుగా అప్‌డేట్ చేసుకోవడం, 12 నంబర్లతో ఉన్న ఒక కోడ్ ద్వారా ప్రతి నెల పెన్షన్ పొందడం, మరణించిన వారి చెల్లింపులు తక్షణం నిలిపివేయడానికి సహాయపడుతుంది.
Similar News
News April 5, 2026
భాకరాపేట జల్లికట్టు వేడుకల్లో అపశ్రుతి

భాకరాపేట జల్లికట్టులో అపశ్రుతి చోటుచేసుకుంది. చిన్నగొట్టిగల్లు మండలం వేడుకల్లో పశువులు ఒక్కసారిగా జనాలపైకి దూసుకురావడంతో రవిచంద్ర అనే వ్యక్తి మెడలోకి పశువు కొమ్ము దిగింది. తీవ్ర గాయాలైన శ్రీనివాసులు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వేడుకలు మొదలవ్వకముందే జరిగిన ఈ ప్రమాదంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు.
News April 5, 2026
NLG: ఏప్రిల్‌లోనే రూ. 8.50 కోట్ల పన్ను వసూలు!

నల్గొండ నగరపాలక సంస్థ ఈ ఏడాది ఆస్తి పన్ను వసూళ్లలో వేగం పెంచింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం రూ. 18 కోట్ల పన్ను డిమాండ్ ఉండగా, కేవలం ఈ ఏప్రిల్ నెలలోనే రూ. 8.50 కోట్లు వసూలు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏడాది మొత్తంలో వచ్చే ఆదాయంలో దాదాపు సగాన్ని ఈ ఒక్క నెలలోనే రాబట్టేలా మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేక కసరత్తు చేస్తోంది.
News April 5, 2026
NLG: ఏడాది పన్ను ఒకేసారి చెల్లిస్తే రాయితీ!

మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో ఆస్తి పన్ను ముందస్తుగా చెల్లించిన వారికి 5 శాతం రాయితీ కల్పిస్తూ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను మొత్తం ఒకేసారి చెల్లించిన వారికి ఈ రాయితీ వర్తించనుంది. జిల్లాలోని నల్గొండ కార్పొరేషన్, మిర్యాలగూడ, హాలియా, దేవరకొండ, చండూరు, చిట్యాల, నకిరేకల్ మున్సిపాలిటీల్లోని భవన యజమానులకు రాయితీ ఇవ్వనున్నారు.


