News April 16, 2025

తెలంగాణలో చనిపోయిన ముగ్గురు జిల్లా వాసులు వీరే..

image

తెలంగాణలో జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం రాఘవాపూర్ శివారు జాతీయ రహదారి వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అమలాపురం(M) సవరప్పాలేనికి చెందిన ఒకే కుటుంబసభ్యులు ముగ్గురు మృతి చెందారు. సత్తి శ్రీను, భార్య రమణకుమారి, కుమార్తె అనూష చనిపోయారు. వీరి మృతదేహాలకు జనగామ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేసి బుధవారం సొంత గ్రామానికి తీసుకురానున్నట్లు బంధువులు తెలిపారు. వారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News July 5, 2025

నిజామాబాద్: రేషన్ బియ్యానికి 48,978 మంది దూరం..!

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ ముగిసింది. ఉమ్మడి జిల్లాలో 6,60,241 రేషన్ కార్డులు ఉండగా 6,11,263 మంది బియ్యం తీసుకున్నారు. 48,978 మంది రేషన్ తీసుకోలేదు. కాగా మళ్లీ సెప్టెంబర్ నెలలోనే ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయనుంది.

News July 5, 2025

ఆచంట: గోదారమ్మకు చేరుతున్న వరద నీరు

image

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరికి వరద పోటు పెరుగుతోంది. ఆచంట మండలంలో కోడేరు, పెదమల్లం, కరుగోరుమిల్లి, భీమలాపురం పుష్కర ఘాట్ల వద్దకు వరద నీరు చేరింది. పోలవరం వద్ద గోదావరికి వరద నీరు భారీగా చేరుకోవడంతో మరో రెండు, మూడు రోజుల్లో మరింత వరద ప్రవాహం ఉండొచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు.

News July 5, 2025

నీలాక్రమం అలంకరణ భద్రకాళి అమ్మవారు

image

శనివారం సందర్భంగా భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. నీలాక్రమం అలంకరణలో నేడు భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. అమ్మవారికి విశేష పూజలు చేసి హారతి ఇచ్చారు. భక్తులు ఉదయం నుంచి ఆలయం చేరుకుని అమ్మవారిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు.