News April 12, 2025
తెలంగాణలో టాప్ 3లో ఉమ్మడి ADB

భద్రాచలం శ్రీ రాములవారి తలంబ్రాల పంపిణీని ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రారంభిస్తున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం ప్రణీత్ తెలిపారు. శుక్రవారం ఆదిలాబాద్‌లోని ఆర్ఎం కార్యాలయంలో పలువురికి తలంబ్రాలను పంపిణీ చేశారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 4,350 మంది బుక్ చేసుకున్నట్లు వెల్లడించారు. తలంబ్రాల బుకింగ్‌లో రాష్ట్రంలో ఆదిలాబాద్ రీజియన్ మూడో స్థానంలో నిలిచిందన్నారు. సహకరించిన భక్తులందరికీ ధన్యవాదాలు తెలిపారు.
Similar News
News September 13, 2025
మెదక్ జిల్లా కోర్టులో లోక్ అదాలత్

మెదక్ జిల్లా కోర్టులో శనివారం లోక్ అదాలత్ నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ, మెదక్ నీలిమ సూచనల మేరకు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సెక్రటరీ ఎం.శుభవల్లి పర్యవేక్షించారు. రాజీ మార్గమే రాజమర్గమన్నారు. ఈ సందర్బంగా పలువురు తమ కేసుల్లో రాజీ పడ్డారు. న్యాయమూర్తులు సిరి సౌజన్య, సాయి ప్రభాకర్, స్వాతి, న్యాయవాదులు, కక్షిదారులు తదితరులు పాల్గొన్నారు.
News September 13, 2025
‘మిరాయ్’కి తొలి రోజు భారీ కలెక్షన్స్

తేజా సజ్జ హీరోగా కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఫాంటసీ మూవీ ‘మిరాయ్’ నిన్న థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం తొలి రోజు వరల్డ్ వైడ్‌గా ₹27.20 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు మూవీ టీమ్ తెలిపింది. దీంతో ‘హనుమాన్’ తొలిరోజు(₹8 కోట్లు) కలెక్షన్స్‌ను దాటేసింది. తేజ కెరీర్లో ఇవే హయ్యెస్ట్ ఫస్ట్ డే ఓపెనింగ్స్. పాజిటివ్ టాక్ నేపథ్యంలో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశముంది.
News September 13, 2025
నకిరేకల్‌లో విద్యార్థినికి లైంగిక వేధింపులు..!

నకిరేకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇంగ్లిష్ టీచర్‌గా పనిచేస్తున్న మామిడి శ్రీనివాస్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ టీచర్ విద్యార్థినిని వేధిస్తున్నట్లు ఆమె తల్లిదండ్రులకు తెలియజేయడంతో ఈ విషయం బయటపడింది. ఈ విషయాన్ని బయటపెట్టకుండా రాజీ చేసేందుకు కొందరు ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రయత్నించినట్లు తెలిసింది. బాధితురాలి తల్లిదండ్రులు ఉపాధ్యాయుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.