News May 18, 2024

తెలంగాణ ఈఏపీ సెట్ ఫలితాల్లో కర్నూలు విద్యార్థుల ప్రభంజనం

image

తెలంగాణ ఈఏపీ సెట్ ఫలితాల్లో కర్నూలు విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. కాసేపటి క్రితం విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. టాప్-5లో కర్నూలు జిల్లా నుంచి ఇద్దరు విద్యార్థులు నిలిచారు. ఇంజినీరింగ్ విభాగంలో హర్ష స్టేట్ సెకెండ్ ర్యాంకు సాధించగా.. సాయియశ్వంత్ రెడ్డి ఐదో ర్యాంకు సాధించారు.

Similar News

News December 31, 2025

కర్నూలు జిల్లాలో కొత్త పాస్ పుస్తకాల జారీ.. ఎప్పటినుంచంటే?

image

కర్నూలు జిల్లాలోని 141 గ్రామాల్లో జనవరి 2 నుంచి 9 వరకు నిర్వహించే రెవెన్యూ గ్రామసభల ద్వారా రైతులకు రాజముద్రతో కూడిన 94,090 కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు. పాత భూహక్కు పత్రాలు తిరిగి ఇచ్చి కొత్త పాస్‌పుస్తకాలు అందజేస్తారన్నారు. రైతులు గ్రామసభలకు హాజరుకావాలని కోరారు.

News December 31, 2025

కర్నూలు: ‘ప్రైవేట్ వాహనాలకు VLTD తప్పనిసరి’

image

అన్ని ప్రైవేట్ సర్వీస్ వాహనాలకు 2026 జనవరి 1 నుంచి VLTD (వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైస్) తప్పనిసరి అని కర్నూలు రవాణా శాఖ ఉప కమిషనర్ శాంత కుమారి తెలిపారు. మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్, స్టేజీ క్యారేజ్, కాంట్రాక్ట్ క్యారేజ్‌తో పాటు అన్ని సరుకు వాహనాల యజమానులు సమీప RFC కేంద్రాల్లో VLTD బిగించి రవాణా శాఖలో నమోదు చేయాల్నారు. VLTD అమర్చని వాహనాలకు వాహన్ పోర్టల్‌లో అందుబాటులో ఉండవని అన్నారు.

News December 31, 2025

ట్రైనీ కానిస్టేబుళ్లు క్రమశిక్షణతో మెలగాలి: ఎస్పీ

image

క్రమశిక్షణ, చట్టాలపై అవగాహనతో పాటు సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించుకోవాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్లకు సూచించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చి కర్నూలు జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో ట్రైనింగ్ పొందుతున్న 205 ట్రైనీ కానిస్టేబుళ్లను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మారుతున్న నేరాలకు అనుగుణంగా టెక్నాలజీ, కమ్యూనికేషన్ స్కిల్స్‌లో నైపుణ్యం అవసరమి చెప్పారు.