News April 9, 2025
తెలంగాణ పేరును కేసీఆర్ నిలబెడితే రేవంత్ రెడ్డి పడగొట్టారు: హరీశ్ రావు

తెలంగాణ పేరును 10ఏళ్ల పాలనలో కేసీఆర్ దేశవ్యాప్తంగా నిలబెడితే సంవత్సర పాలనలో సీఎం రేవంత్ రెడ్డి పడగొట్టారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. బుధవారం సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ.. ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రాన్ని పాలించడంలో సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారన్నారు. కేసీఆర్ మొక్కలు నాటితే ఇప్పుడు పెరిగిన చెట్లను రేవంత్ రెడ్డి కొట్టేస్తున్నారన్నారు.
Similar News
News March 1, 2026
కొమ్మాల జాతర ప్రభలపై ఆంక్షలు

కొమ్మాల జాతరను పురస్కరించుకుని ప్రభ బండ్ల ఊరేగింపుపై పోలీసులు మార్గదర్శకాలు జారీ చేశారు. శాంతిభద్రతల దృష్ట్యా ప్రభ బండ్ల మధ్య కనీసం 100 మీటర్ల దూరం పాటించాలని, కేటాయించిన ప్రదేశాల్లోనే వాటిని తయారు చేయాలని ఆదేశించారు. రాజకీయ జెండాలు, రెచ్చగొట్టే నినాదాలు, డీజేల వినియోగంపై పూర్తి నిషేధం విధించారు. సౌండ్ సిస్టమ్ వాడితే నిర్ణీత పరిమితుల్లోనే ఉండాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
News March 1, 2026
విజయనగరంలో పోలీసుల ర్యాలీ

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయనగరం కోట జంక్షన్ నుంచి మూడు లాంతర్ల వరకు పోలీసులు ఆదివారం ర్యాలీ నిర్వహించారు. మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలని, వారి రక్షణకు పోలీసుశాఖ కట్టుబడి ఉందని డీఎస్పీ గోవిందరావు పేర్కొన్నారు. ఆపద సమయంలో సహాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ‘శక్తి’ యాప్‌ను ప్రతీ మహిళ మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.
News March 1, 2026
పెరిగిన జీఎస్టీ వసూళ్లు

AP: రాష్ట్రంలో గూడ్స్, సర్వీస్ ట్యాక్స్ వసూలు గతంలో కన్నా పెరిగింది. కేంద్ర ప్రభుత్వం GST-2.0లో పలు వస్తువులపై ట్యాక్సుల భారాన్ని తగ్గించినా రాబడిలో పురోగతి నమోదైంది. 2026 FEBలో నెట్ వసూలు ₹3061 CR కాగా గ్రాస్ ₹3562 CRవసూలు అయ్యింది. అదే 2025 FEBలో నెట్ ₹2902CR కాగా గ్రాస్ ₹3569CRగా ఉంది. సెస్‌తో సంబంధం లేకుండా గ్రాస్ వసూళ్లు తగ్గినా నెట్ వసూళ్లలో మాత్రం ₹150 CR పెరుగుదల కనిపించింది.


