News March 12, 2025
తెలంగాణ బడ్జెట్.. జనగామ జిల్లా ఎదురుచూస్తోంది!

అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. జనగామ జిల్లాలోని పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. పాలకుర్తికి 100 పడకల ఆసుపత్రి, జిల్లాలో పెద్ద మొత్తంలో ఇండస్ట్రియల్ పర్క్స్, ఘనపూర్‌కు 100 పడకల ఆసుపత్రి, ముఖ్యంగా పాలకుర్తిలో డిగ్రీ కాలేజ్, చెన్నూరు రిజర్వాయర్ పూర్తి చేసి దిగువ ప్రాంతాలను సాగు, తాగు నీరు అందించాలని, యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
Similar News
News March 12, 2025
పండగే.. వచ్చే 19 రోజుల్లో 8 రోజులు సెలవులు

ఐటీ, ITES ఉద్యోగులకు రానున్న రెండు వారాలు ఆఫీసులకు వెళ్లినట్లే అన్పించదు. ఎందుకంటే మాసంలో మిగిలిన 19 రోజుల్లో 8 రోజులు సెలవులే. 14న హోలీ, 15-16 వీకెండ్ కావడంతో వరుసగా మూడ్రోజులు హాలీడే. ఇక 22-23 వీకెండ్. తిరిగి 29న వీకెండ్, 30 సండే+ఉగాది ఉండగా 31న రంజాన్ సందర్భంగా సెలవు. మొత్తం 8 సెలవుల్లో 2సార్లు 3 రోజుల చొప్పున లాంగ్ వీకెండ్ వస్తుంది. దీంతో సరదాగా ట్రిప్‌కు వెళ్లే వారు ప్లాన్స్ మొదలుపెట్టారు.
News March 12, 2025
కళ్లు పొడిబారుతున్నాయా? ఈ చిట్కాలు పాటించండి

కంప్యూటర్ ముందు వర్క్ చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో 20సెకన్ల పాటు కళ్లను మూసి విశ్రాంతి నివ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. స్క్రీన్‌ను కళ్లకు తక్కువ ఎత్తులో ఉండేలా చూసుకోండి. రాత్రివేళల్లో సెల్‌ఫోన్ వాడకం తగ్గించండి. లైటింగ్ వల్ల కంటి చిన్నకండరాలు త్వరగా అలసిపోతాయి. ఏసీ, కూలర్ నుంచి వచ్చే గాలులు నేరుగా కంటిమీద పడనివ్వకండి. గోరువెచ్చని నీటితో శుభ్రపరచండి. బ్లూలైట్ ఫిల్టర్ గ్లాసెస్ వాడటం బెటర్.
News March 12, 2025
CM రేవంత్‌పై అసభ్యకర వ్యాఖ్యలు.. ఇద్దరు మహిళా జర్నలిస్టుల అరెస్ట్

TG: సీఎం రేవంత్‌పై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఇద్దరు మహిళా జర్నలిస్టులను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. రేవతి, తేజస్విని అనే మహిళలను అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. వీరి నుంచి రెండు ల్యాప్టాప్స్, ఫోన్లను సీజ్ చేశారు.