News March 12, 2025
తెలంగాణ బడ్జెట్.. నిర్మల్‌కు ఏం కావాలంటే..!

అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. నిర్మల్ జిల్లాలోని పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. కడెం ప్రాజెక్ట్ సుందరీకరణ, గడ్డెన్నవాగు అప్‌గ్రెడేషన్‌కు నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. బాసరను మున్సిపాలిటీగా చేస్తే అభివృద్ధి చెందుతుందని.. పర్యాటకంగా మరిన్ని అవకాశాలు ఏర్పడతాయంటున్నారు. కవ్వాల్ అభయారణ్యం, గోదావరి ఎకో టూరిజంను డెవలప్ చేయాలని కోరుతున్నారు.
Similar News
News September 16, 2025
అక్రమాస్తుల కేసుల విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

ఏపీ ఏసీబీ నమోదు చేసిన అక్రమాస్తుల కేసుల విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విజయవాడ సెంట్రల్ ఇన్‌వెస్టిగేషన్ యూనిట్‌కి పోలీస్ స్టేషన్ హోదా లేదని 11 FIRలను హైకోర్టు కొట్టివేయగా ఏసీబీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం కేసులపై విచారణకు, ఛార్జ్‌షీట్‌ల దాఖలుకు అనుమతినిచ్చింది.
News September 16, 2025
మంజీరా నది ఉరకలేస్తుంది..!

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయిని నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి మళ్లీ పెరిగింది. దీంతో ప్రాజెక్టులోని తొమ్మిది గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ వరద ఉద్ధృతి కారణంగా పిట్లం మండలం బొల్లక్ పల్లి మంజీరా బ్రిడ్జి వద్ద మంజీర నది ఉరకలేస్తూ ప్రవహిస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి ఔట్‌ఫ్లో 62,542 క్యూసెక్కులుగా ఉంది.
News September 16, 2025
కామారెడ్డిలో ‘స్వస్త్ నారీ సశక్తి పరివార్ అభియాన్’

కామారెడ్డి జిల్లాలో ఈనెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు ‘స్వస్త్ నారీ సశక్తి పరివార్ అభియాన్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అన్ని పీహెచ్‌సీల పరిధిలో ఈ కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. 15 రోజులు జరిగే కార్యక్రమం విజయవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు.