News March 12, 2025
తెలంగాణ బడ్జెట్.. సిద్దిపేట జిల్లాకు ఇవి కావాలి..?

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. మరి సిద్దిపేటకు నిధులు కేటాయిస్తారా.. చూడాలి. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన టూరిజం స్పాట్ శిల్పారామం రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ వద్ద బీచ్, ప్రభుత్వ వైద్య, నర్సింగ్, పశువుల వైద్య కాలేజీల్లో పెండింగ్ పనులతో పాటు ఇంటిగ్రేటెడ్ మార్కెట్, రంగనాయక సాగర్ డ్యాం వద్ద ఎల్లమ్మ గుడి వద్ద బ్రిడ్జి పనులు పూర్తి చేయాలి. యువతకు ఉపాధి కల్పించాలి.
Similar News
News March 12, 2025
జగన్‌పై విజయసాయి సంచలన వ్యాఖ్యలు

AP: మాజీ CM YS జగన్‌పై YCP మాజీ నేత విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కోటరీకి అనుకూలంగా ఉంటేనే జగన్ దగ్గరికి తీసుకెళ్తారు. కోటరీ మాటలు వినొద్దని జగన్‌కు చాలాసార్లు చెప్పినా ఫలితం లేదు. చెప్పుడు మాటలను నాయకుడు వినకూడదు. జగన్ మనసులో స్థానం లేదు కాబట్టి YCP నుంచి బయటకు వచ్చా. నా మనసు విరిగిపోయింది. విరిగిన మనసు మళ్లీ అతుక్కోదు. తిరిగి వైసీపీలో చేరే ప్రసక్తే లేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు.
News March 12, 2025
గుంటూరులో గుర్తు తెలియని వ్యక్తి మృతి

గుంటూరులో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడని కొత్తపేట పోలీసులు తెలిపారు. జీజీహెచ్ ఆసుపత్రి మెయిన్ గేట్ వద్ద వ్యక్తి చనిపోయాడని సెక్యూరిటీ గార్డు కొత్తపేట పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు మార్చురీకి తరలించారు. ఈ వ్యక్తి ఆచూకీ ఎవరికైనా తెలిసినట్లయితే పోలీసుల్ని సంప్రదించాలని కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
News March 12, 2025
పోలీస్ సిబ్బంది కుటుంబాలకు అండగా ఉంటాం: ఎస్పీ

పోలీస్ సిబ్బంది కుటుంబాలకు అండగా ఉంటామని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ఎమ్.సంపూర్ణ రావు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ మేరకు సంపూర్ణ రావు సతీమణి మార్తమ్మకు బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఫ్లాగ్ ఫండ్, విడో ఫండ్ చెక్‌లను జిల్లా ఎస్పీ అందజేశారు.