News December 16, 2025
తెలంగాణ మొత్తం అప్పు ₹4,42,297 కోట్లు

TG: రాష్ట్రం అప్పు మొత్తం ₹4,42,297 కోట్లకు చేరినట్లు RBI తాజా రిపోర్ట్ ప్రకటించింది. ‘2024లో ₹3.93L కోట్లు కాగా 2025 మార్చినాటికి మరో ₹50వేల కోట్లు పెరిగింది. ఇందులో స్టేట్ డెవలప్‌మెంట్ లోన్‌గా ₹3.58L కోట్లు, పవర్ బాండ్లతో ₹7100 CR, NSSF నుంచి ₹3334 CR, నాబార్డు నుంచి ₹5390CR, బ్యాంకుల నుంచి ₹3వేల Cr, కేంద్రం నుంచి ₹14727 CR, PF నుంచి ₹16,700 CR రుణం తీసుకుంది’ అని పేర్కొంది.
Similar News
News December 17, 2025
ఓటు వేసి వెళ్తూ గుండెపోటుతో మృతి

TG: తుది విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ వేళ ఖమ్మం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సత్తుపల్లి మండలం బేతుపల్లిలో ఓటు వేసి ఇంటికి వెళ్తుండగా నాగులవంచ సత్యనారాయణ(65) గుండెపోటుకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే సత్తుపల్లి ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగియనుంది.
News December 17, 2025
లేటెస్ట్ మూవీ అప్డేట్స్

*రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న “ది రాజా సాబ్” సినిమా నుంచి ఈరోజు రెండో సాంగ్ విడుదల. సాయంత్రం 5 గంటల నుంచి హైదరాబాద్‌లోని లులు మాల్‌లో ఈవెంట్ ప్లాన్ చేసిన నిర్మాతలు.
*విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు రవికిరణ్ తెరకెక్కిస్తోన్న ‘రౌడీ జనార్ధన’ టీజర్ విడుదల 22వ తేదీకి వాయిదా.
*మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక మూవీ “వృషభ” ఈ నెల 25న విడుదల కానుంది.
News December 17, 2025
ఫ్రిజ్ లేకపోయినా కూరగాయలు ఇలా ఫ్రెష్..

ఫ్రిజ్ లేకపోయినా కూరగాయలు ఫ్రెష్‌గా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి. * క్యారెట్లను అల్యూమినియం ఫాయిల్ తో చుట్టి, పైన, కింద తెరిచి ఉంచాలి. * కరివేపాకును ఎయిర్‌టైట్ డబ్బాలో పెట్టాలి. * గిన్నెలో నీళ్లు నింపి క్యాబేజీ అడుగు మునిగేలా ఉంచాలి. * టమాటాలు కాస్త గట్టివి తీసుకుంటే ఎప్పటికప్పుడు పండినవి వాడుకోవచ్చు. * కొనేటప్పుడే చూసుకొని ఎండినట్లు, వాడినవి తీసుకోకూడదు. ఇంట్లో ఎండ, వేడి తగలనిచోట కూరగాయలు ఉంచాలి.


