News October 22, 2025
తెలంగాణ రైజింగ్-2047 సర్వేలో పాల్గొనాలి: కలెక్టర్

తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ రూపకల్పన కోసం ఉద్దేశించిన తెలంగాణ రైజింగ్-2047 సర్వేలో అధికారులు, ప్రజలు పాల్గొనాలని జనగామ కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా కోరారు. సర్వే ఈనెల 25న ముగుస్తుందని తెలిపారు. కావున, జిల్లా ప్రజలు తెలంగాణ అధికారిక వెబ్‌సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని సర్వేలో భాగస్వాములు కావాలని కోరారు.
Similar News
News October 24, 2025
బస్ ఎక్కకుండా ప్రాణాలు దక్కించుకున్నాడు

కర్నూలు ఘోర బస్సు ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే బస్సులో TGకి చెందిన 15 మంది టికెట్లు బుక్ చేసుకున్నారు. వీరిలో తరుణ్ అనే యువకుడు మాత్రం చివరి నిమిషంలో ప్రయాణం రద్దు చేసుకున్నారు. ఆయన సీట్ నంబర్ U-2లో టికెట్ బుక్ చేసుకున్నారు. HYD ప్యారడైజ్ వద్ద బోర్డింగ్ చేయాల్సి ఉండగా బస్ ఎక్కకుండా ప్రమాదం నుంచి సురక్షితంగా బయపడ్డారు. మిగతా 14 మందిలో 8 మంది మరణించారు.
News October 24, 2025
FLASH: సిద్దిపేట జిల్లాలో యాక్సిడెంట్

ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బైక్ ఢీకొని యువకుడు మృతిచెందిన ఘటన సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్ గ్రామానికి చెందిన యువకుడు(29) బైక్‌పై వస్తున్నాడు. బెజ్జంకి క్రాసింగ్ దగ్గర రాజీవ్ రహదారిపైకి రాగానే హైదరాబాద్ వైపు రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనకాల నుంచి వేగంగా ఢీకొట్టి చనిపోయాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
News October 24, 2025
పెద్దపల్లి: పాము కాటుతో డిగ్రీ విద్యార్థిని మృతి

పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో విషాదం నెలకొంది. రూపునారాయణపేట గ్రామానికి చెందిన డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న గుర్రం అక్షిత(18) దీపావళి సెలవులకు ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో ఇంట్లో ఉండగా దురదృష్టవశాత్తు ఆమెను పాము కుట్టింది. స్పందించిన స్థానికులు తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా కరీంనగర్ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


