News October 21, 2025

తెలంగాణ రైజింగ్-2047 సిటిజన్ సర్వేలో అందరూ పాల్గొనాలి: కలెక్టర్

image

తెలంగాణ రైజింగ్-2047 సిటిజన్ సర్వేలో అందరూ పాల్గొనాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. రాష్ట్ర భవిష్యత్ రూపకల్పనకై ఉద్దేశించిన తెలంగాణ రైజింగ్ సిటిజన్ సర్వేకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. ఇప్పటివరకు ఈ సిటిజన్ సర్వేలో వివిధ ప్రాంతాల పౌరులు పాల్గొని తమ విలువైన సమాచారాన్ని అందచేశారని అన్నారు. telanganarising అనే వెబ్‌సైట్‌ను సందర్శించి, సలహాలు అందించాలన్నారు.

Similar News

News October 22, 2025

భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది: రేణూ దేశాయ్

image

రేణూ దేశాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో తాను సన్యాసం తీసుకునే అవకాశం ఉందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తాను డబ్బుకు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వనని, జాగ్రత్తగా ఖర్చు పెడతానని తెలిపారు. ఆధ్యాత్మికతకు ప్రియారిటీ ఇస్తానని తెలిపారు. గతంలో రెండో పెళ్లి గురించి ఆలోచిస్తానని ఆమె <<16044331>>వ్యాఖ్యానించిన<<>> సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

News October 22, 2025

జిల్లాలో కార్తీక శోభ కనిపించే ఆలయాలు ఇవే..!

image

కార్తీకమాసంలో ఆలయాలను సందర్శిస్తే మంచి జరుగుతుందనేది భక్తుల విశ్వాసం. అందుకే ఈ మాసంలో ఏ ఆలయాల్లో చూసినా భక్తుల రద్దీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. జిల్లాలో రామతీర్థం రామస్వామి ఆలయం, విజయనగరంలో రామనారాయణ టెంపుల్, సారిపల్లి దిబ్బేశ్వరస్వామి ఆలయం, పుణ్యగిరి శివాలయం, గోవిందపురంలోని సంతోషిమాత ఆలయం, గంట్లాంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాల్లో ప్రతి ఏటా ఎక్కువగా భక్తుల రద్దీ ఉంటూ వస్తోంది.

News October 22, 2025

బీఎస్ఎన్ఎల్ కొత్త రీఛార్జ్ ప్లాన్

image

సీనియర్ సిటిజన్(60 ఏళ్లు పైబడిన) నూతన యూజర్ల కోసం BSNL కొత్త ప్లాన్ తీసుకొచ్చింది. రూ.1,812తో రీఛార్జ్ చేసుకుంటే ఏడాది పాటు రోజూ 2GB డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, 100 SMSలు అందించనుంది. దీంతోపాటు BiTV సబ్‌స్క్రిప్షన్ 6 నెలల పాటు ఉచితంగా అందించనుంది. వచ్చే నెల 18 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. అటు కొత్త యూజర్లకు రూ.1కే <<18014372>>రీఛార్జ్<<>> ఆఫర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.