News August 6, 2024

తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్!

image

తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరుపొందిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ HNK జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామానికి చెందినవారు. ఆగస్టు 6వ తేదీ 1934లో జన్మించి, 21 జూన్ 2011లో మరణించారు. గతంలో కేయూ వైస్ ఛాన్సలర్‌గా విధులు నిర్వర్తించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ధ్యేయంగా ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ కీలకపాత్ర పోషించారు. జయశంకర్ సార్ పేరిట భూపాలపల్లి జిల్లాను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

Similar News

News October 1, 2024

ములుగు జిల్లాలో ఆకాశంలో అద్భుత దృశ్యం

image

ములుగు జిల్లాలో ఆకాశంలో వింత ఘటన చోటు చేసుకుంది. సోమవారం వెంకటాపురంలో ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఉదయం ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి. సాయంత్రం మేఘాలలో మార్పు రావడంతో మేఘం వింతగా కనిపించింది. ఈ దృశ్యాన్ని పలువురు ఫోనులో బంధించారు. ఇలా మేఘంలో మార్పు రావడానికి దేనికైనా సంకేతమా..? లేక మామూలుగా జరిగిందన్న విషయంపై మండలంలో తీవ్రంగా చర్చ జరుగుతుంది.

News September 30, 2024

మహిళలు ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి: ఎంపీ కావ్య

image

మహిళలు ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని ఎంపీ కడియం కావ్య అన్నారు. ఘనపూర్లో కావ్య మాట్లాడుతూ.. మహిళల్లో రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ వంటి వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయని, ఇలాంటి వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించాలని లేకపోతే ప్రాణాంతకం అయి ప్రాణాలకే ముప్పు వస్తుందని హెచ్చరించారు. మహిళలు ఎలాంటి భయాందోళనలు లేకుండా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

News September 30, 2024

ఐనవోలు మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న ఎంపీ కావ్య

image

ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి వారిని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజురితో కలిసి వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు ఎంపీకి పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు ఆలయ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.