News February 14, 2025
తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయుడు సంజీవయ్య: ఎస్పీ

దామోదరం సంజీవయ్య తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయుడు అని ఎస్పీ తుషార్ డూడి కొనియాడారు. దామోదరం సంజీవయ్య 104వ జయంతి సందర్భంగా శుక్రవారం బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యలయంలో ఆయన చిత్రపటానికి ఎస్పీ పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం దామోదరం సంజీవయ్య విద్యాభ్యాసం, నిస్వార్ధ రాజకీయ జీవితం గురించి పోలీస్ సిబ్బందికి వివరించారు.
Similar News
News July 6, 2025
ట్రిపుల్ ఐటీల్లో మిగిలిన 598 సీట్లు

నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు త్రిపుల్ ఐటీలో మొదటి విడత కౌన్సెలింగ్ పూర్తయింది. ఇంకా 598 సీట్లు మిగిలాయి. నూజివీడు ట్రిపుల్ ఐటీలో 139 సీట్లు, ఇడుపులపాయలో 132, శ్రీకాకుళంలో 144, ఒంగోలు ట్రిపుల్ ఐటీలో 183 సీట్లు మిగిలాయి. మిగిలిన సీట్లను రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించి భర్తీ చేసేందుకు ట్రిపుల్ ఐటీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
News July 6, 2025
అరుణాచలంకు స్పెషల్ రైళ్లు

ఉమ్మడి కృష్ణా జిల్లా మీదుగా అరుణాచలం (తిరువణ్ణామలై)కు ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ఈ రైళ్ల అడ్వాన్స్ టికెట్ బుకింగ్ ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని రైల్వే అధికారులు తెలిపారు. నరసాపురం-తిరువణ్ణామలై (నెం. 07219) రైలు జులై 9, 16, 23, ఆగస్టు 6, 13, 20, సెప్టెంబర్ 3, 24 తేదీల్లో కైకలూరు, గుడివాడ, విజయవాడలలో ఆగుతుంది.
News July 6, 2025
MLA వరదకు సర్జరీ.. కాల్ చేసి మాట్లాడిన CM

ప్రొద్దుటూరు MLA వరదరాజులరెడ్డి గుండె ఓపెన్ సర్జరీ చేయించుకుని HYD ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. విషయం తెలుసుకున్న CBN శనివారం వరదకు కాల్ చేసి ఆరోగ్య పరిస్థితిని గురించి తెలుసుకున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే త్వరగా కోలుకుని మళ్లీ ప్రజాసేవలోకి రావాలంటూ ఆకాంక్షించినట్లు సమాచారం.