News October 25, 2025
తెలుగు పాఠ్యప్రణాళికలో స్థానిక పాఠ్యాంశాలు

సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు పాఠ్యప్రణాళికలో స్థానిక అంశాలకు పెద్దపీట వేశామని తెలుగుశాఖ అధ్యక్షుడు డా. మట్టా సంపత్కుమార్ రెడ్డి తెలిపారు. కళాశాల స్వయంప్రతిపత్తి హోదా సాధించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ మార్పులు చేశామన్నారు. పాఠ్యప్రణాళికలో స్వయంప్రతిపత్తి నిబంధనలను అనుసరించి, స్థానికులకు ప్రాధాన్యత కల్పిస్తూ సముచిత మార్పులు చేశామని,ఈ మార్పు తొలిసారిగా జరుగుతోందని పేర్కొన్నారు.
Similar News
News October 26, 2025
సెలవులు లేవు: కలెక్టర్

తుపాన్ సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటి సెలవులు లేవని కలెక్టర్ వినోద్ కుమార్ చెప్పారు. శనివారం జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో అధికారుల సమర్థవంతంగా పనిచేసి తుపానును ఎదుర్కోవాలని సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలను మత్స్యకారులను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. తుపాను సమయంలో వారికి కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు.
News October 26, 2025
ICC ర్యాంకింగ్స్‌లో రోహిత్ నం.1!

ఆస్ట్రేలియాతో సిరీస్‌లో అదరగొట్టిన రోహిత్ శర్మ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నం.1 స్థానం దక్కించుకోనున్నారు. ప్రస్తుతం 745 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్న హిట్‌మ్యాన్ తాజా సిరీస్‌లో 202 రన్స్ చేయడంతో నం.1కు వెళ్లినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 29న ఐసీసీ అధికారికంగా ర్యాంకులను ప్రకటించనుంది. అటు గిల్ (768 పాయింట్లు), జర్దాన్ (764 పాయింట్లు) టాప్-2లో ఉన్నారు.
News October 26, 2025
ఈ గుణం ఉంటేనే భగవంతుని ప్రేమ దక్కుతుంది

భగవద్భక్తిలో సంపూర్ణ విశ్వాసం పొందాలంటే మానవుడు సత్వ గుణాన్ని పెంచుకొని, రజో-తమో గుణాలను తగ్గించుకోవాలని వేమన పద్యాల్లో పేర్కొన్నారు. ‘త్రిగుణాల ప్రభావం దేవుళ్లపై స్పష్టంగా ఉంటుంది. సత్వగుణం కలవారు దేవున్ని నమ్ముతారు. రజోగుణం కలవారు ‘దేవుడు ఉన్నాడా, లేడా’ అనే సందేహంతో ఊగిసలాడతారు. తమోగుణం కలవారికి కష్టాలు వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తాడు, ఇతర వేళల్లో దేవుడు లేడని వాదిస్తారు’ అని రాశారు. <<-se>>#WhoIsGod<<>>


