News February 25, 2026

తెలుగు భాషను మరువొద్దు: మంత్రి లోకేశ్

image

సత్తెనపల్లి సుగాలి జెడ్పీ హైస్కూల్ విద్యార్థులతో వెలగపూడి అసెంబ్లీ లాబీలో మంత్రి లోకేశ్ ముచ్చటించారు. పిల్లలే రాష్ట్ర భవిత అని, చరిత సృష్టించేది మీరేనని ఆయన అన్నారు. కెరీర్ కోసం ఇంగ్లీష్ నేర్చుకుంటూనే మాతృభాష తెలుగును మరవొద్దని సూచించారు. విదేశాల్లో చదవడం వల్ల మొదట్లో తాను ఇబ్బంది పడ్డానని చెప్పారు. ఈ సందర్భంగా స్కూల్లో భోజనం, రాగిజావ, బోధన తదితర సౌకర్యాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

Similar News

News February 25, 2026

బ్రాహ్మణపల్లిలో షీ టీం అవగాహన సదస్సు

image

రామగుండం సీపీ ఆదేశాల మేరకు, షీ టీం ఇంచార్జి ఎస్ఐ లావణ్య ఆధ్వర్యంలో పెద్దపల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో వార్డ్ మెంబర్ల శిక్షణలో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళల భద్రత, సైబర్ మోసాలు, యాంటీ డ్రగ్స్ అంశాలపై వివరించారు. వేధింపులపై 6303923700కు, సైబర్ మోసాలపై 1930కు సమాచారం ఇవ్వాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 100కు డయల్ చేయాలన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

News February 25, 2026

జగిత్యాల: ఖాదీ గ్రామోద్యగ భండార్ కొనుగోళ్లు ప్రారంభం

image

జగిత్యాల పట్టణంలో బుధవారం మెట్‌పల్లి ఖాదీ గ్రామోద్యోగ ప్రతిష్టా ఖాదీ గ్రామోద్యోగ భండార్ కొనుగోలును ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, జడ్పీ మాజీ ఛైర్‌పర్సన్ దావ వసంత, మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ అడువాల జ్యోతి, భండార్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ భండార్ తహసీల్ చౌరస్తా, గాయత్రీ బ్యాంకు దగ్గర కొలువైంది.

News February 25, 2026

అష్టలక్ష్మి: ధనలక్ష్మి మాతను ఎలా పూజించాలంటే?

image

ధనలక్ష్మి దేవిని నీలి వస్త్రాలు, పూలతో పూజించాలని పండితులు సూచిస్తున్నారు. తద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని చెబుతున్నారు. ‘నీలి రంగు విశాలత్వాన్ని, సంపద స్థిరత్వాన్ని సూచిస్తుంది. ఆ రంగున్న వస్తువులతో అమ్మవారిని పూజిస్తే సంపద నిలకడగా ఉంటుంది. ఇంట్లో దారిద్ర్యం పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆర్థిక వృద్ధిని ఆకాంక్షించే వారు ధనలక్ష్మి అమ్మవారిని ఇలా పూజించాలి. మంచి ఫలితాలుంటాయి’ అంటున్నారు.