News January 3, 2026

తెలుగు మహా సభలకు మారిషస్ అధ్యక్షుడు

image

AP: 3వ ప్రపంచ తెలుగు మహాసభలు గుంటూరులో అట్టహాసంగా కొనసాగుతున్నాయి. ఇవాళ ఈ సభల్లో SC న్యాయమూర్తి జస్టిస్ P.శ్రీనరసింహ పాల్గొన్నారు. ‘భాష కేవలం భావవ్యక్తీకరణే కాదు. ఒక ప్రపంచాన్ని సృష్టించేంత బలం భాషలో ఉంటుంది’ అని ఆయన తెలిపారు. రేపు ఈ సభల్లో మారిషస్ అధ్యక్షుడు ధరమ్ గోకుల్ పాల్గొననున్నారు. ఆయనకు గన్నవరం విమానాశ్రయంలో మంత్రి కందుల దుర్గేశ్ స్వాగతం పలికారు. ఈ సభలు 8వ తేదీ వరకు కొనసాగనున్నాయి.

Similar News

News February 15, 2026

శివరాత్రి ఉపవాసం చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు పాటించండి!

image

ఇవాళ మహా శివరాత్రి సందర్భంగా భక్తులు <<19142196>>ఉపవాస దీక్షలు<<>> ఆచరిస్తారు. అయితే పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ‘శరీరం డీహైడ్రేట్ కాకుండా నీరు ఎక్కువగా తీసుకోవాలి. నిమ్మరసం, కొబ్బరి నీళ్లు తాగితే మంచిది. పాలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ వంటి సాత్విక ఆహారం తీసుకోవచ్చు’ అని చెబుతున్నారు. ఉపవాసం తర్వాత భారీగా తినొద్దని, ముందు తేలికైన ఆహారంతో ప్రారంభించాలని పేర్కొంటున్నారు.

News February 15, 2026

ఫిబ్రవరి 15: చరిత్రలో ఈరోజు

image

1564: ఇటలీ ఖగోళ శాస్త్రవేత్త గెలీలియో జననం
1739: బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జననం
1861: UK గణిత శాస్త్రజ్ఞుడు, తత్వవేత్త ఆల్ఫ్రెడ్ నార్త్ వైట్‌హెడ్ జననం
1964: సినీ దర్శకుడు, నిర్మాత అశుతోశ్ గోవారికర్ జననం
1982: సినీ నటి మీరా జాస్మిన్ జననం
2022: మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ బప్పి లాహిరి మరణం (ఫొటోలో)

News February 15, 2026

చిరంజీవి సినిమాలో ‘ఛాంపియన్’ హీరోయిన్?

image

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబోలో <<18950253>>మరో సినిమా<<>> తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో పవర్‌ఫుల్ తండ్రి పాత్రలో చిరు కనిపించనున్నారని చర్చ జరుగుతోంది. కీలకమైన కూతురు క్యారెక్టర్ కోసం ‘ఛాంపియన్’ మూవీ హీరోయిన్ అనస్వర రాజన్ పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కృతి శెట్టి, సారా అర్జున్ పేర్లనూ పరిశీలించారని సమాచారం. దీనిపై త్వరలోనే అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.