News September 21, 2024

తెలుగు యూనివర్సిటీకి సురవరం పేరు.. చిన్నారెడ్డి హర్షం

image

వనపర్తి: మొట్టమొదటి ఎమ్మెల్యే దివంగత సురవరం ప్రతాపరెడ్డి పేరును తెలుగు యూనివర్శిటీకి పెడుతూ క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకోవడం హర్షనీయమని రాష్ట్ర ప్రణాళికాసంఘం వైస్ ఛైర్మన్ చిన్నారెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. స్వాతంత్రోద్యమంలో గోల్కొండ పత్రికతో ఉద్యమస్ఫూర్తి, పోరాటజ్వాలలు రగిలించిన గొప్ప వ్యక్తి సురవరంప్రతాపరెడ్డి అని కొనియాడారు.

Similar News

News September 21, 2024

NGKL: దేశంలోనే తొలి ఆర్థోడాంటిస్ట్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి

image

బెంగళూరులో నిర్వహించిన ఇండియన్ ఆర్థోడాంటిస్ట్ కాన్ఫరెన్స్‌కు ముఖ్యఅతిథిగా నాగర్ కర్నూల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి హాజరయ్యారు. దేశంలోనే తొలి ఆర్థోడాంటిస్ట్ ఎమ్మెల్యే కుచుకూళ్లను కౌన్సిల్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇంతటి గొప్ప స్థానంలో ఉంచినందుకు నాగర్ కర్నూల్ ప్రజలకు, తనను గుర్తించి గౌరవ సత్కారం చేసినందుకు కౌన్సిల్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

News September 21, 2024

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలలో నూతన పోలీస్ స్టేషన్‌లకు కసరత్తులు

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా జనాభా, పరిపాలన సులభతరం కావడానికి గత ప్రభుత్వం నూతన మండలాలను ఏర్పాటు చేసింది. గండీడ్ మండల కేంద్రంలో నూతన పోలీస్ స్టేషన్ నిర్మించాలనే ప్రతిపాదన జిల్లా ఎస్పీ జానకి ప్రభుత్వానికి పంపించామని శుక్రవారం తెలిపారు. అలాగే జిల్లా కేంద్రంలో 3వ టౌన్, జడ్చర్లలో సబ్ డివిజన్ కార్యాలయం, ట్రాఫిక్ రూరల్ పోలీస్ స్టేషన్, కౌకుంట్లలో నూతన భవనాలకు నివేదికను ఇచ్చామన్నారు.

News September 21, 2024

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు 13 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో

image

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు శుక్రవారం సాయంత్రం 13 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. జెన్ కో జలవిద్యుత్ కేంద్రంలో ఉదయం నాలుగు యూనిట్లలో విద్యుదుత్పత్తి చేయగా రాత్రి రెండు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి చేశారు. విద్యుదుత్పత్తి కోసం శ్రీశైలంలో 7,849 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 95 క్యూసెక్కులు ఇలా ప్రాజెక్టు నుంచి మొత్తం 11,654 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.