News January 26, 2026

తెలుగు రాష్ట్రాల్లో ఎట్ హోం.. హాజరైన ప్రముఖులు

image

తెలుగు రాష్ట్రాల లోక్‌భ‌వన్‌లలో ‘ఎట్ హోం’ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ‌AP గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఇచ్చిన తేనీటి విందుకు CM చంద్రబాబు, Dy.CM పవన్ కళ్యాణ్ సహా కీలక నేతలు, ప్రముఖులు హాజరయ్యారు. ఇటు TGలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో Dy.CM భట్టి సహా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురికి ఎక్స‌లెన్స్ అవార్డులు ఇచ్చారు.

Similar News

News February 4, 2026

చిరంజీవి ‘వారసుడు’ కామెంట్లపై విమర్శలు.. ఘాటుగా స్పందించిన లావణ్య

image

రామ్‌చరణ్‌కు కవలలు పుట్టడంతో చిరంజీవి గతంలో చేసిన ‘వారసుడు’ కామెంట్లపై పలువురు SMలో విమర్శలు చేశారు. దీనిపై మెగా ఫ్యామిలీ కోడలు లావణ్య త్రిపాఠి ఘాటుగా స్పందించారు. ‘మీ పోస్ట్ అభ్యంతరకరంగా, ఆనందకరమైన క్షణాలను తుడిచిపెట్టేలా ఉంది. కుటుంబంలోని మహిళలు, మనవరాళ్లతో చిరు ఎంత ఫ్రెండ్లీగా ఉంటారో మీకు తెలియదు. ఆయన చేసేదాంట్లో చాలామంది 1% కూడా చేయరు. తెలియని వ్యక్తుల గురించి మాట్లాడొద్దు’ అని హితవు పలికారు.

News February 4, 2026

ఇండియన్ ఆర్మీలో JAG ఎంట్రీ స్కీమ్‌కు దరఖాస్తుల ఆహ్వానం

image

<>ఇండియన్ <<>>ఆర్మీ JAG(జడ్జీ అడ్వకేట్ జనరల్ బ్రాంచ్)ఎంట్రీ స్కీమ్ 124వ కోర్సు కోసం షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా 8 పోస్టులను భర్తీ చేయనుంది. LLB అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 27వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 21 నుంచి 27ఏళ్ల మధ్య ఉండాలి. CLAT PG-2025, షార్ట్ లిస్టింగ్, SSB, PST, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. 49వారాల పాటు ట్రైనింగ్ ఇస్తారు. వెబ్‌సైట్: https://joinindianarmy.nic.in

News February 4, 2026

ఘోస్ట్ జాబ్స్ గురించి తెలుసా?

image

కొన్ని కంపెనీలు కావాలనే లేని జాబ్ ఆఫర్స్‌ను జాబ్ పోర్టల్స్‌లో పోస్ట్ చేస్తుంటాయి. వీటినే ఘోస్ట్ జాబ్స్ అంటారు. వీటికి అప్లై చేసుకుంటే స్పందన కోసం నెలల కొద్దీ వేచి చూడాలి. కంపెనీ యాక్టివ్‌గా ఉందని, గ్రో అవుతోందని ఇన్వెస్టర్లకు, క్లయింట్లకు చూపించడానికి, అభ్యర్థుల లిస్ట్ రెడీ చేసుకోవడానికి ఈ పద్ధతిని ఫాలో అవుతుంటాయి. అయితే ఇవి దీర్ఘకాలంలో కంపెనీలు, ఉద్యోగార్థులపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముంది.