News January 25, 2026

తెలుగు రాష్ట్రాల్లో విషాదం.. వేర్వేరు ఘటనల్లో ఐదుగురి మృతి

image

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ పలు ఘటనల్లో ఐదుగురు మరణించారు. నాగర్ కర్నూల్(D) ముచ్చర్లపల్లిలో నీటి గుంతలో పడి సిరి(14), శ్రీమన్యు(14), స్నేహ(15) అనే ముగ్గురు విద్యార్థులు మరణించారు. గుంతలో పడిన ఒకరిని కాపాడే క్రమంలో మరో ఇద్దరు చనిపోయారు. APలోని నెల్లూరు(D) తూర్పు రొంపిదొడ్లలో ఇద్దరు యువకులు గణేశ్ (16), రమేశ్ (15) బైక్‌పై వెళ్తుండగా కందిచేను చుట్టూ ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి సజీవదహనమయ్యారు.

Similar News

News February 11, 2026

VIRAL: రైలులో గణేశుడి ఆలయం.. తెలుసా?

image

బిహార్‌లోని జయనగర్ నుంచి అమృత్‌సర్ వెళ్లే భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలులో ఒక అరుదైన దృశ్యం కనిపిస్తుంది. ఇందులోని S-1 కోచ్‌లో 37వ నంబర్ బెర్త్‌ను గణేశుడికి కేటాయించారు. అక్కడ ఒక చిన్న ఆలయాన్ని ఏర్పాటు చేసి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. గత 12 ఏళ్లుగా ప్రయాణికులు ఎవరూ ఈ బెర్త్‌ను బుక్ చేసుకోకుండా దేవుడికే వదిలేస్తున్నారు. ప్రయాణం సురక్షితంగా సాగాలని కోరుకుంటూ భక్తులు ఇక్కడ మొక్కులు చెల్లించుకోవడం విశేషం.

News February 11, 2026

T20 WC: తడబడి నిలబడిన విండీస్

image

ఇంగ్లండ్‌తో మ్యాచులో వెస్టిండీస్ 196/6 రన్స్ చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు 8 పరుగులకు 2.. 77 రన్స్‌కు 4 వికెట్లు కోల్పోయింది. దీంతో WI తక్కువ స్కోర్‌కే చాప చుట్టేస్తుందని అనుకున్నారు. కానీ రూథర్‌ఫోర్డ్ 76, ఛేజ్ 34, హోల్డర్ 33 రన్స్‌తో రాణించడంతో 200 మార్క్‌కు చేరువైంది. ENG బౌలర్లలో రషీద్, ఓవర్టన్ చెరో 2 వికెట్లు తీశారు.

News February 11, 2026

ఇళ్ల క్రమబద్ధీకరణ గడువు పొడిగింపు

image

AP: క్యాబినెట్ భేటీలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ భూముల్లోని ఇళ్ల క్రమబద్ధీకరణ గడువును జూన్ వరకు పొడిగించింది. భూముల బదిలీకి సంబంధించి చట్టసవరణకు ముసాయిదా బిల్లు, ఏపీ ఏఐ లివింగ్ ల్యాబ్స్ ప్రారంభం సహా మొత్తం 24 అంశాలకు ఆమోదం తెలిపింది. ఆగిరిపల్లిలో బయోగ్యాస్ ప్లాంట్‌కు 45.6 ఎకరాలు, సంజామలలో సౌర విద్యుత్ ప్రాజెక్టుకు 1500 ఎకరాలు, ఆనందపురంలో 18.57 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించింది.