News January 22, 2026

తెలుగు రాష్ట్రాల్లో సరస్వతీ దేవి ఆలయాలు

image

వసంత పంచమి నాడు తెలుగు రాష్ట్రాల్లోని సరస్వతీ క్షేత్రాలు భక్తజనంతో పోటెత్తుతాయి. TGలోని నిర్మల్ జిల్లాలో బాసర జ్ఞాన సరస్వతి ఆలయం అక్షరాభ్యాసాలకు ప్రసిద్ధి. సిద్దిపేట(D) వర్గల్ విద్యా సరస్వతి క్షేత్రం కూడా ఎంతో విశిష్టమైనది. APలోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారు పండుగ రోజు సరస్వతీ దేవి రూపంలో దర్శనమిస్తారు. మెదక్(D) ముక్తేశ్వర క్షేత్రం, అనంతపురం(D) హేమావతి ఆలయాల్లోనూ ప్రత్యేక పూజలు చేస్తారు.

Similar News

News February 11, 2026

లోక్‌సభలో రగడ.. అసలు రాహుల్ ఏమన్నారంటే?

image

ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లోక్‌సభలో మాట్లాడుతూ ఎప్‌స్టీన్ ఫైల్స్ ప్రస్తావన తేవడం రాజకీయ దుమారం రేపింది. ‘ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో పేరున్న పారిశ్రామికవేత్త అనిల్ అంబానీని ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? అసలు ఎప్‌స్టీన్‌కు అనిల్‌ను పరిచయం చేసిందెవరో కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్ పురికి తెలుసు’ అని రాహుల్ వ్యాఖ్యానించడంతో బీజేపీ తీవ్ర అభ్యంతరం తెలిపింది.

News February 11, 2026

MLAల ప్రసంగాలు వింటా.. మంత్రుల సమాధానాలు చూస్తా: CBN

image

AP: 20నెలల కూటమి పాలనలో విభేదాలు లేవని CM CBN అన్నారు. ‘మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం. నిబద్ధత లేకపోతే ఫలితాలు రావు. పెండింగ్ పనులను నా దృష్టికి తీసుకురండి. జిల్లాల వారీగా నేతలు, అధికారులతో సమావేశం పెడతా. అసెంబ్లీ సమావేశాలను సీరియస్‌గా తీసుకోవాలి. 9am-1pm వరకు సభ్యులంతా సభలో ఉండాలి. MLAల ప్రసంగాలు వింటా..మంత్రుల సమాధానాలు చూస్తా. అసెంబ్లీని నేను కూడా పూర్తిగా గమనిస్తా’ అని CM చెప్పారు.

News February 11, 2026

శివరాత్రి స్పెషల్.. RTC బస్సు ఛార్జీల పెంపు

image

శివరాత్రి సందర్భంగా TGSRTC 2,243 స్పెషల్ బస్సులు నడుపుతోంది. వీటిలో శ్రీశైలానికి 781, వేములవాడకు 416, కీసరకు 326 ఉన్నాయి. దీంతో స్పెషల్ బస్సుల్లో టికెట్ రేట్లను సంస్థ 1.5రెట్లు పెంచింది. ఈ నెల 14 నుంచి 16 వరకు ఇది అమల్లో ఉండనుంది. రెగ్యులర్ సర్వీసుల్లో ఎలాంటి మార్పు ఉండదు. స్పెషల్ పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లో మహిళలకు యథావిధిగా ఫ్రీ జర్నీ అమల్లో ఉంటుంది.