News September 11, 2025
తెలుగు వర్శిటీలో స్పాట్ అడ్మిషన్లు

ఈ ఎడాదికి గాను పీజీలో చేరెందుకు సురవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్శిటీలో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు వర్శిటీ డైరెక్టర్ డా.బి.రాధ Way2Newsతో తెలిపారు. ఈనెల 19, 20న ఉ.11.00 గం. – సా.4.30 వరకు బాచుపల్లిలో దరఖాస్తులు చేసుకోవాలని, ఆసక్తి గల విద్యార్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, 3 ఫోటోలు, 3 సెట్ జిరాక్స్ పత్రాలతో హాజరు కావాలన్నారు. ప్రవేశ పరీక్ష రాయని వారు రూ.600 డీడీను సమర్పించాలన్నారు.
Similar News
News February 13, 2026
దేవరకద్ర పురపాలికలో తొలి విజయం

దేవరకద్ర పురపాలికల్లో ఎన్నికల ఫలితాల్లో తొలి విజయం నమోదైంది. 12వ డివిజన్‌లో యుగేందర్ రెడ్డి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థిపై 157 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ గెలుపుతో బీఆర్ఎస్ నాయకులలో ఉత్సాహం నెలకొంది. లెక్కింపు కేంద్రం వద్ద కార్యకర్తలు సంబరాలు మొదలుపెట్టారు. ఇక్కడ ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా పోలీసులు తగు చర్యలు తీసుకున్నారు.
News February 13, 2026
MBNR: 41 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు!

మహబూబ్ నగర్ జిల్లాలోని 81 డివిజన్ల మున్సిపల్ ఎన్నికల లెక్కింపునకు అధికారులు 41 టేబుళ్లను సిద్ధం చేశారు. ఇందులో మహబూబ్ నగర్ కార్పొరేషన్ కోసం 30, దేవరకద్రకు 6, భూత్పూర్ మున్సిపాలిటీకి 5 టేబుళ్లను కేటాయించారు. మొత్తం 185 మంది సిబ్బంది ఈ ప్రక్రియలో పాల్గొంటున్నారు. ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రారంభం కానుంది.
News February 13, 2026
నేడే మహబూబ్‌నగర్ కౌంటింగ్!

మహబూబ్‌నగర్ కార్పొరేషన్, దేవరకద్ర, భూత్పూర్ మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు పాలమూరు వర్సిటీలో మరికాసేపట్లో ప్రారంభం కానుంది. తొలుత బ్యాలెట్ పేపర్లను బండిల్స్ చేయనున్నారు. ఉదయం 9:30 నుంచి 10:30 గంటల మధ్య తొలి ఫలితం వెలువడే అవకాశం ఉంది. అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.


