News January 24, 2026

తెలుగు వెండితెర ‘కాంచనమాల’ వర్ధంతి నేడు

image

తెలుగు చలనచిత్ర తొలితరం అందాల తార చిట్టాజల్లు కాంచనమాల (1917–1981) వర్ధంతి నేడు. 1917, మార్చి 5న ఉమ్మడి గుంటూరు (D) అమృతలూరు(M) కూచిపూడిలో జన్మించారు. 1935లో ‘శ్రీకృష్ణ తులాభారం’తో తెరంగేట్రం చేసిన ఆమె, తన అద్భుత నటనతో ‘ఆంధ్రా గ్రేటా గార్భో’గా పేరు తెచ్చుకున్నారు. ‘మాలపిల్ల’ (1938) చిత్రం ఆమెకు ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టింది. గృహలక్ష్మి, వందేమాతరం, బాలనాగమ్మ వంటి చిత్రాల్లో ఆమె నటన చిరస్మరణీయం.

Similar News

News February 9, 2026

టీ20ల్లో చెత్త రికార్డ్

image

శ్రీలంక టీ20 జట్టు కెప్టెన్ దసున్ శనక చెత్త రికార్డ్ మూటగట్టుకున్నారు. ఇవాళ T20 WCలో ఐర్లాండ్‌పై డకౌటైన ఆయన టీ20ల్లో అత్యధిక(16) సార్లు సున్నాకే ఔటైన ప్లేయర్‌గా నిలిచారు. నేడు ఎదుర్కొన్న తొలి బంతినే షార్ట్ థర్డ్ మ్యాన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు. టీ20Iల్లో ఇతని తర్వాత రువాండ జట్టుకు చెందిన జప్పీ(15), ఐర్లాండ్ కెప్టెన్ స్టెర్లింగ్(14) డకౌట్ అయిన లిస్టులో ఉన్నారు.

News February 8, 2026

వరంగల్ సీపీ కీలక ఆదేశాలు

image

వరంగల్ కమిషనరేట్ పరిధిలోని జనగామ, ఘన్ పూర్, వర్ధన్నపేట, పరకాల, నర్సంపేట మున్సిపాలిటీల్లో సోమవారం సా.5 గంటలతో ఎన్నికల ప్రచార గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో సీపీ సన్ ప్రీత్ సింగ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రచార గడువు ముగిసిన వెంటనే ప్రచారానికి వచ్చిన బయటి వ్యక్తులు వెళ్లిపోవాలని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని కోరారు.

News February 8, 2026

పట్టుదలతో సాగిపోవాలి.. GenZ స్టూడెంట్స్‌తో రాహుల్ గాంధీ

image

జీవితం ఎప్పుడూ సాఫీగా ఉండదని, పట్టుదలతో ముందుకు సాగిపోవాలని జెన్‌జీ విద్యార్థులకు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సూచించారు. ‘ఇన్‌సెక్యూరిటీ, కాన్ఫిడెన్స్ తక్కువగా ఉందని ఎక్కువ మంది చెప్పారు. నువ్వు నిజాయతీగా ఉండటమే ముఖ్యం. అనుకున్న దానికంటే ఎక్కువ సామర్థ్యం ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది. భారత్ జోడో యాత్రలో ఆ విషయాన్ని తెలుసుకున్నాను’ అని UAEకి చెందిన NRI స్టూడెంట్స్‌తో ఇంటరాక్షన్‌లో చెప్పారు.