News September 22, 2025

తెలుగు సినిమాకు సంగీతం అందించిన దర్శక శిఖరం

image

బొడ్డు గోపాలం (1927-2004) ఒక ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకుడు. ఆయన గుంటూరు జిల్లా తుళ్లూరులో జన్మించారు. ప్రజా నాట్య మండలిలో చేరి “చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా” వంటి దేశభక్తి గీతాలకు స్వరకల్పన చేసి ప్రసిద్ధి పొందారు. తర్వాత ఘంటసాల దగ్గర సహాయకుడిగా పనిచేసి, “నలదమయంతి” చిత్రంతో స్వతంత్ర సంగీత దర్శకుడిగా మారారు. “రంగులరాట్నం”, “కరుణామయుడు” వంటి చిత్రాలకు ఆయన సంగీతం అందించారు.

Similar News

News September 22, 2025

దసరా సెలవులు ప్రకటించినా… కొన్ని పాఠశాలలు కొనసాగింపు

image

రాష్ట్రంలోని పాఠశాలలకు సెప్టెంబర్ 22 నుంచి దసరా సెలవులు ఇవ్వాలని మంత్రి లోకేశ్ ప్రకటించారు. అయితే గుంటూరు జిల్లాలో ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా కొన్ని ప్రైవేట్ పాఠశాలలు పరీక్షల పేరుతో, మరికొందరు సిలబస్ పేరుతో సెలవులు ఇవ్వకుండా స్కూల్ తరగతులు కొనసాగిస్తున్నట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీనిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ వ్యక్తమవుతోంది.

News September 22, 2025

GNT: దర్శనం టికెట్ల కౌంటర్ కోసం QR కోడ్

image

విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో దసరా మహోత్సవం సందర్భంగా భక్తుల సౌలభ్యం కోసం కొత్త సదుపాయం అందుబాటులోకి వచ్చింది. టికెట్ కౌంటర్లకు సులభంగా చేరుకునేందుకు ప్రత్యేకంగా QR కోడ్ స్కానర్లు ఏర్పాటు చేశారు. భక్తులు స్కాన్ చేస్తే లొకేషన్‌ల జాబితా మొబైల్‌లో ప్రత్యక్షమై, కావలసిన స్థలాన్ని ఎంచుకుని గూగుల్ మ్యాప్ ద్వారా సులభంగా చేరుకోవచ్చు. భక్తులు ఈ సౌకర్యాన్ని వాడుకొని సులభంగా అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు.

News September 21, 2025

డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటి సర్వే: కలెక్టర్

image

అతిసార లక్షణాలున్న ప్రాంతాల్లో 33 బృందాలతో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. ఈ నెల 16 నుంచి ఇప్పటివరకు 80 కేసులు నమోదయ్యాయని చెప్పారు. జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నవారిలో 13 మందిని సాధారణ వార్డులకు తరలించామని, 11 మంది డిశ్చార్జ్ అయ్యారని వివరించారు.